అమ్మోబొమ్మ.. అక్కడికి వెళ్ళగానే వణికిపోతూ ఏడ్చేస్తున్నారు అందరూ.. కారణమేమిటంటే..

ABN , First Publish Date - 2023-02-24T13:32:27+05:30 IST

ఎంతో డేంజర్ అయిన ఈ అన్నా బెల్లె బొమ్మకు జేజమ్మలాంటి బొమ్మ

 అమ్మోబొమ్మ.. అక్కడికి వెళ్ళగానే వణికిపోతూ ఏడ్చేస్తున్నారు అందరూ.. కారణమేమిటంటే..

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో అమ్మో బొమ్మ అని ఓ సినిమా వచ్చింది. అది గుర్తులేకపోతే ప్రపంచ ఫేమస్ హర్రర్ మూవీ అన్నాబెల్లె చాలామందికి తెలిసే ఉంటుంది.ఎంతో డేంజర్ అయిన ఈ అన్నా బెల్లె బొమ్మకు జేజమ్మలాంటి బొమ్మ ఉందని తెలిసింది. ఎంతోపాతకాలం పబ్ లో బంధించిన ఈ బొమ్మ దగ్గరకు వెళ్ళగానే అప్రయత్నంగా ఒణికిపోతూ పెద్దపెట్టున ఏడ్చేస్తున్నారు. కేవలం ఓ బొమ్మ కారణంగా వీరందరూ అలా ప్రవర్తిస్తుండటం షాక్ కు గురిచేసే విషయం. అందరినీ అంత భయపెడుతున్న ఈ బొమ్మ గురించి తెలుసుకుంటే..

యూకే(UK) లోని చెస్టర్(Chester) లో 400 సంవత్సరాల కిందటి పబ్ ఒకటుంది. దీనిపేరు 'ఓల్డ్ కింగ్స్ హెడ్ హోటల్'. ఇందులో ఒక గదిలో ఓ జోకర్ బొమ్మ(Joker doll) ఉంది. ఆ బొమ్మను గొలుసులతో కట్టేసి ఉంచారు. దీన్ని ఎవరూ ముట్టుకోరు. ఈ బొమ్మను దయ్యాలు ఆవహించాయని చెబుతారు. మొదట్లో ఈ బొమ్మ ఒక చోట నుండి మరొకచోటికి తన ప్లేస్ మార్చుకునేదట. దీని ప్రభావం అక్కడికి వచ్చిన చాలా మందిపై చూపించేదట. ఈ కారణంగా బొమ్మను గొలుసుతో కట్టేశారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా చాలా మంది మానవాతీత శక్తుల గురించి నమ్మేవారు ఈ పబ్ కు వెళ్ళి ఈ బొమ్మ సమక్షంలో హాయిగా మద్యం సేవిస్తున్నారు.

Read also: Mens Pregnancy Test: మగాళ్లు ప్రగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే జరిగేదేంటి..? పాజిటివ్ రిజల్ట్ వస్తే ఆ రిస్క్ ఉన్నట్టేనా..?


మానవాతీత శక్తుల మీద పరిశోధనలు చేసే కొందరు ఈ బొమ్మ తమతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుందని చెప్పడం విశేషం. ఈ జోకర్ బొమ్మ పేరు 'ద గ్రేస్ డాల్' అని అక్కడి పబ్ సిబ్బంది చెప్పారు. పారానార్మల్ యాక్టివిటిపై పరిశోధనలు చేస్తున్న డానీ మోస్ అనే వ్యక్తి ఈ బొమ్మను అక్కడ తెచ్చిపెట్టాడట. ఈ బొమ్మ అతడితో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన ఆడియో టేప్ లు కూడా ఉన్నాయని ఇతను తెలిపాడు. ఈ హోటల్ కు పార్టీలకు వెళ్ళడం, పారానార్మల్ యాక్టివిటీస్ ను నమ్మడం చేసేవారిని ఈ బొమ్మ చాలా ఆకర్షిస్తుంది. ఈ హోటల్ గదిలో ఎవరంటే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి లేదు. ఇంకా ఈ బొమ్మను చాలా మంత్రాల మధ్య పెట్టెలో బంధించారు. ఈ పెట్టెను కూడా ఉప్పుతో వృత్తం ఏర్పాటుచేసి అందులో ఉంచారు. ఆ వృత్తం దాటి వెళితే బొమ్మ ద్వారా చాలా హాని జరుగుతుందని అంటున్నారు. ఈ బొమ్మ దగ్గరకు వెళ్ళేవారికి వింత వింత శబ్ధాలు, మాటలు వినిపిస్తాయి, కొంతమంది స్పృహ తప్పి పడిపోతున్నారు. చలికి వణుకుతూ ఏడ్చేస్తున్నారు. తనను ఆ పెట్టెలోనుండి బయట పడేయమని ఈ బొమ్మ చాలా రకాలుగా సిగ్నల్ ఇస్తోంది. ఏదిఏమైనా హర్రర్ మూవీ అన్నాబెల్లె కన్నా ఇది చాలా డేంజరని అక్కడి వారి నమ్మకం.

Updated Date - 2023-02-24T13:32:30+05:30 IST