Viral Video: స్విమ్మింగ్‌ పూల్‌లో ఇలా చేస్తే.. ఏం జరుగుతుందో తెలిసి కూడా ఓ వ్యక్తి వింత చేష్టలు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-15T13:39:22+05:30 IST

స్విమ్మింగ్ పూల్స్‌లో సరదాగా గడపడానికి చాలా మంది ఇష్టపడతారు. కొందరికి పూల్‌లో ఈత కొట్టడం ఇష్టం, మరికొందరికి నీటిలో అద్భుతమైన విన్యాసాలు చేయడం ఇష్టం. ఆ క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.

Viral Video: స్విమ్మింగ్‌ పూల్‌లో ఇలా చేస్తే.. ఏం జరుగుతుందో తెలిసి కూడా ఓ వ్యక్తి వింత చేష్టలు.. చివరకు..!

స్విమ్మింగ్ పూల్స్‌లో (Swimming Pool) సరదాగా గడపడానికి చాలా మంది ఇష్టపడతారు. కొందరికి పూల్‌లో ఈత కొట్టడం ఇష్టం, మరికొందరికి నీటిలో అద్భుతమైన విన్యాసాలు చేయడం ఇష్టం. ఆ క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి వాటర్ స్లైడ్ (Water Slide) ముందు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో చూస్తే భయం వేయక మానదు.

@1000waystod1e అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పూల్‌లో ఉన్న వాటర్ స్లైడ్ ముందు నిలబడి ఉన్నాడు. లోపలి నుంచి ఒక వ్యక్తి జారుకుంటూ వచ్చినప్పుడు పూల్‌లో నిలబడిన వ్యక్తి కిందకు వంగాడు. కాసేపటి తర్వాత పైకి లేచాడు. అదే సమయంలో మరో వ్యక్తి స్లైడ్ నుంచి బయటకు వేగంగా వచ్చాడు. అతడు వేగంగా తన కాలితో పూల్‌లో ఉన్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మెడకు (Neck) తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది.

Viral Video: పిల్లలు కాదండోయ్.. పిడుగులు.. నిండా పదేళ్ల వయసు కూడా ఉండదు కానీ.. వీళ్ల వీడియోను చూస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించగా, 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న వ్యక్తి పరిస్థితి ఏంటని కామెంట్లు చేస్తున్నారు. కచ్చితంగా ఆ వ్యక్తి మెడ విరిగిపోయి ఉంటుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2023-05-15T13:39:22+05:30 IST