Bank Deposit Form: ఇదేంటయ్యా సామీ.. బ్యాంకు వాళ్లు పెళ్లి సంబంధాలేమైనా చూస్తారనుకున్నావా ఏంటీ..?
ABN , First Publish Date - 2023-06-27T15:09:30+05:30 IST
మన రోజు వారీ జీవితంలో ఎన్నో సరదా సంఘటనలు ఎదురవుతుంటాయి. ఎంతో మంది తుంటరి పనులు చేసి నవ్వు తెప్పిస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అవన్నీ ఎంతో మందికి చేరుతున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ పోస్ట్ ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
మన రోజు వారీ జీవితంలో ఎన్నో సరదా సంఘటనలు ఎదురవుతుంటాయి. ఎంతో మంది తుంటరి పనులు చేసి నవ్వు తెప్పిస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అవన్నీ ఎంతో మందికి చేరుతున్నాయి. అవి వైరల్ (Viral Funny post) అవుతున్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ పోస్ట్ ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లి రిసీప్ట్ మీద రాసింది అందరికి నవ్వు తెప్పిస్తోంది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@NationFirst78 అనే ట్విటర్ యూజర్ ఆ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో ఒక బ్యాంక్ డిపాజిట్ స్లిప్ (Bank Deposit Form)ను చూడవచ్చు. ఆ వ్యక్తి డిపాజిట్ రిసీప్ట్ మీద తన గురించి పూర్తి వివరాలు రాశాడు. ``అమౌంట్`` అనే కాలమ్‌లో తన రాశి ``తులా రాశి`` (Libra) అని రాశాడు. మొరాదాబాద్ (Moradabad)లోని ఓ బ్యాంక్ బ్రాంచ్‌లో ఓ వ్యక్తి ఇలా రాశాడు. ఆ స్లిప్‌ను ఫొటో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Cow Video: వరదలో కొట్టుకుపోతున్న లేగదూడ.. ఎవరూ కాపాడలేని పరిస్థితి.. ప్రాణాలతో ఎలా బయటపడిందంటే..
ఆ ట్వీట్‌పై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ``బాబూ.. అది బ్యాంకు అనుకుంటున్నావా? మ్యారేజ్ బ్యూరో అనుకుంటున్నావా`` అని ఒకరు కామెంట్ చేశారు. ``అక్కడ ఎవరైనా పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పారా?`` అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.