చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో అతని ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చా?... నిపుణులు చెప్పే సమాధానం ఇదే..
ABN , First Publish Date - 2023-03-27T12:43:38+05:30 IST
మనిషి చనిపోయిన తర్వాత వేలిముద్రలు(fingerprints) మారిపోతాయి. మరణం(death) తర్వాత శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ కూడా ముగిసిపోతుంది. శరీరం(body)లోని కణాలు కూడా పనిచేయడం మానేస్తాయి.
మనిషి చనిపోయిన తర్వాత వేలిముద్రలు(fingerprints) మారిపోతాయి. మరణం(death) తర్వాత శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ కూడా ముగిసిపోతుంది. శరీరం(body)లోని కణాలు కూడా పనిచేయడం మానేస్తాయి. మనిషి మరణించిన తరువాత ఆ వ్యక్తి వేలిముద్రలు మునుపటిలా ఉండవు. మరణానంతరం వేలిముద్రలు తీసుకోవాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మరణం తర్వాత మానవ వేలిముద్రలు మారిపోతాయి.
ఫోరెన్సిక్ నిపుణులు(Forensic experts) ల్యాబ్‌లో మాత్రమే వీటిని గుర్తించగలుగుతారు. ఇందుకోసం వారు సిలికాన్ పుట్టీని ఉపయోగిస్తారు. సిలికాన్ పుట్టీపై వేలిముద్రలు స్పష్టంగా వస్తాయి, కాగా మరణించిన వ్యక్తికి చెందిన మొబైల్(Mobile) అతని వేలిముద్రలతో అన్‌లాక్ అవదు. మొబైల్ ఫోన్‌ల సెన్సార్లు(Sensors) మనిషి శరీరంలోని విద్యుత్ వాహకత ఆధారంగా పనిచేస్తాయి. మరణం శరీరంలో ఎలక్ట్రికల్ కండక్టెన్స్(Electrical conductance) నిలిచిపోయినప్పుడు మొబైల్ ఫోన్‌ల సెన్సార్లు వేలి ముద్రలను గుర్తించలేవు.