Phone Call While Charging: ఫోన్ మాట్లాడేటప్పుడు చార్జింగ్ పెట్టొద్దనేది అందుకే.. ఈ 16 ఏళ్ల కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-04-19T18:38:24+05:30 IST

కొంతమంది ఛార్జింగ్ లో ఉండగానే ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, పాటలు వినడం చేస్తుంటారు. ఓ కుర్రాడు తనకు ఫోన్ రావడంతో ఫోన్ ఛార్జింగ్ లో ఉండగానే మాట్లాడుతున్నాడు. అప్పుడే

Phone Call While Charging: ఫోన్ మాట్లాడేటప్పుడు చార్జింగ్ పెట్టొద్దనేది అందుకే.. ఈ 16 ఏళ్ల కుర్రాడికి ఏం జరిగిందో తెలిస్తే..!

ప్రస్తుతకాలంలో అందరి జీవితాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నది స్మార్ట్ ఫోన్(smart phone) లే. ఒక్కనిమిషం మొబైల్ కు దూరంగా ఉండలేరు. మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతే ఏదో కోల్పోయినట్టే ఫీలవుతారు. కొంతమంది ఛార్జింగ్ లో ఉండగానే ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, పాటలు వినడం చేస్తుంటారు. ఓ కుర్రాడు తనకు ఫోన్ రావడంతో ఫోన్ ఛార్జింగ్ లో ఉండగానే మాట్లాడుతున్నాడు. అప్పుడే ఊహించని సంఘటన జరిగింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులను(smart phone users) భయానికి గురిచేసే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బదౌన్(budaun) జిల్లాలో బిసౌలీ గ్రామంలో సత్యం శర్మ అనే కుర్రాడు తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నాడు. ఇతను ఈ ఏడాది పదవ తరగతి ఫలితాలలో ఉత్తీర్ణత(pass out in 10th class results) సాధించాడు. సత్యం శర్మకు స్మార్ట్ పోన్లంటే పిచ్చి(crazy about smart phones). దీంతో పదవతరగతి పాసైనందుకు తనకు కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ తీసివ్వమని తండ్రిని డిమాండ్ చేశాడు. తండ్రి కూడా కాదనలేక 20వేలు ఖర్చుపెట్టి(20 thousand rupees) మంచి బ్రాండ్ మొబైల్(brand mobile), స్మార్ట్ వాచ్(smart watch) తీసిచ్చాడు. సత్యం రోజంతా కొత్త మొబైల్, కొత్త స్మార్ట్ వాచ్ వెంట ఉంచుకునేవాడు. మొబైల్ ఛార్జింగ్ అయిపోవడంతో ఛార్జింగ్ పెట్టాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో ఛార్జర్ రిమూవ్ చేయకుండా అలాగే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఉన్నట్టుండి మొబైల్ బ్లాస్ట్ అయ్యింది. ఆ పేలుడు ధాటికి సత్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. శబ్దానికి పరిగెత్తుకొచ్చిన తల్లిదండ్రులు కొడుకు పరిస్థితి చూసి భోరున విలపించారు.సత్యంను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


హాస్పిటల్ లో సత్యంను పరిశీలించిన అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్థారించారు. పేలుడు సమయంలో షాక్(shock) సంభవించిందని, ఆ కారణంగానే సత్యం మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. సత్యం మరణంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా మొబైల్ ఛార్జింగ్ లో ఉండగా ఫోన్ మాట్లాడొద్దని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా తొందరగా వేడి పెరుగుతాయని, అవి ఛార్జింగ్ పెట్టినప్పుడు వాటికి దూరంగా ఉండటం చాలా మంచిదని చెప్పారు

Cool Water: ఎండ నుండి ఇంటికి రాగానే చల్లనీళ్లు గడగడా తాగేస్తున్నారా? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే..


Updated Date - 2023-04-19T18:38:24+05:30 IST