Viral Video: ఆకాశంలో విమానం.. పైలెట్‌కు కనిపించిందో అద్భుత దృశ్యం.. అదేంటో చూస్తే..!
ABN , First Publish Date - 2023-11-20T20:39:00+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. విమానాన్ని (Flight) నడుపుతూ ఓ పైలెట్ (Pilot) తీసిన ఓ వీడియో అందమైన పెయింటింగ్‌ను తలపిస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
pilot_astro అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. థామస్ అనే పైలెట్ విమానంలో వెళుతూ రాత్రి సమయంలో తనకు ఆకాశంలో కనిపించిన అందమైన దృశ్యాన్ని వీడియో తీశాడు. ఆకుపచ్చ, ఎరుపు రంగులతో మిళితమైన కాంతి అద్భుతంగా ఉంది. ఈ అరుదైన దృశ్యం నెదర్లాండ్స్ (Netherlands) గగనతలం నుంచి కనిపించింది. ఆ వీడియోను థామస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను 49 వేల మందికి పైగా లైక్ చేశారు.
Viral Video: ఆ వేలికి మాత్రం ఉంగరాన్ని అస్సలు తొడక్కూడదట.. ఏ వేలికి ఉంగరం ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే..!
ఆకాశంలో ఇలాంటి కాంతులను ``అరోరా బొరియాలిస్`` అంటారు. సాధారణంగా వీటిని నార్తర్న్ లైట్స్ (Northern Lights)అని కూడా అంటారు. సూర్యుడి నుంచి వచ్చే సౌర పవన కణాలు భూమికి సమీపంలోకి ప్రవేశించిన తర్వాత ఆక్సిజన్‌తో చర్యవల్ల గ్రీన్ కలర్‌ను, నైట్రోజన్ వల్ల రెడ్ కలర్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాగా, వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``బ్రదర్.. మీ ఆఫీస్ వ్యూ చాలా బాగుంది``, ``అందమైన పెయింటింగ్ చూస్తున్నట్టు ఉంది``, ``ఇది స్వర్గం కంటే తక్కువ కాదు``, ``గొప్ప అనుభవం``,``మీరు గొప్ప వృత్తిలో ఉన్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.