Quotation Gang: కిరాయి ముఠా కథాంశంతో ప్రియమణి ‘కొటేషన్ గ్యాంగ్’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
ABN , First Publish Date - 2023-01-18T12:01:03+05:30 IST
సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. కిరాయి హత్యలు చేసే ముఠా కథాంశంతో తెరకెక్కించారు.
సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. కిరాయి హత్యలు చేసే ముఠా కథాంశంతో తెరకెక్కించారు. ఫిల్మినెటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై తమిళ, హిందీ భాషల్లో నిర్మించగా, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి ఏప్రిల్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. హీరోయిన్ ప్రియమణి (Priyamani), బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్, నటి సన్నీ లియోన్ (sunny leone), సారా అర్జున్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. వివేక్ కె.కన్నన్ దర్శకత్వం వహించగా.. గాయత్రి సురేష్, వివేక్ కె. కన్నన్ నిర్మించిన ఈ చిత్రానికి డ్రమ్స్ శివమణి సంగీతం అందించారు.
సంగీత దర్శకుడు డ్రమ్స్ శివమణితో కలిసి దర్శకుడు మాట్లాడుతూ.. ‘ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ. ఒక హత్య కేసుతో ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నిజానికి ఓటీటీ కోసమే ఈ చిత్రాన్ని నిర్మించాం. కానీ, కంటెంట్, విజువల్స్ చూస్తే థియేట్రికల్ మూవీ స్థాయిలో చాలా గ్రాండ్‌గా వచ్చింది. అందుకే థియేటర్‌లో ఏప్రిల్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక మల్టీస్టారర్ మూవీ. హైపర్ లింక్ కంటెంట్ కావడంతో తీవ్ర జాప్యం నెలకొంది. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్ర్కిప్టు రాసే సమయంలోనే సంగీత దర్శకుడిగా డ్రమ్స్ శివమణి ఫిక్స్ చేశాం. సన్నీ లియోన్, జాకీష్రాఫ్ పాత్రలు చాలా బాగా వచ్చాయి’ అని వివరించారు’. ‘ఈ సినిమా కథ ఏంటో నాకు తెలియదు. టీజర్ చూసే సంగీతం సమకూర్చేందుకు అంగీకరించాను’ అని డ్రమ్స్ శివమణి తెలిపారు. కాగా ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ని (Trailer) కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఆ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.