Crime: ప్రియుడి తమ్ముడినే పిలిచి.. ఓ మాజీ ప్రేయసి మాస్టర్ ప్లాన్.. నువ్వంటేనే నాకు ఇష్టమంటూ అతడిని ఏమార్చి..!

ABN , First Publish Date - 2023-08-07T19:41:58+05:30 IST

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో దారుణం జరిగింది. అన్నయ్య మాజీ ప్రేయసి మాటలకు మురిసిపోయిన యువకుడు భయంకర నేరం చేశాడు. ఆమె మాయలో పడి స్వంత అన్నయ్యనే చంపుకున్నాడు. తనకు ఏమీ తెలియనట్టు నాటకం ఆడాడు. చివరకు ఆ అమ్మాయి వల్లే పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

Crime: ప్రియుడి తమ్ముడినే పిలిచి.. ఓ మాజీ ప్రేయసి మాస్టర్ ప్లాన్.. నువ్వంటేనే నాకు ఇష్టమంటూ అతడిని ఏమార్చి..!

రాజస్థాన్‌ (Rajasthan)లోని నాగౌర్‌లో దారుణం జరిగింది. అన్నయ్య మాజీ ప్రేయసి (Ex-Lover) మాటలకు మురిసిపోయిన యువకుడు భయంకర నేరం చేశాడు. ఆమె మాయలో పడి స్వంత అన్నయ్యనే చంపుకున్నాడు. తనకు ఏమీ తెలియనట్టు నాటకం ఆడాడు. చివరకు ఆ అమ్మాయి వల్లే పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. దర్యాఫ్తులో పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు. ఆ యువతితో సహా మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Crime News).

నాగౌర్ జిల్లాలోని మంద్వారా గ్రామంలో ఈ నెల 4వ తేదీన రోడ్డు పక్కన 20 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించింది. సమాచంర అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. మృతుడిని మంద్వారానికి చెందిన లేఖరాజ్‌గా గుర్తించారు. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. లేఖరాజ్‌కు సప్నా అనే అమ్మాయితో అఫైర్ ఉందని, కొద్ది రోజులుగా ఆమె లేఖరాజ్‌కు దూరంగా ఉంటోందని పోలీసులకు తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది.

Viral: కోడల్ని రాచిరంపాన పెట్టే అత్తలున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్లు ఉంటారా..? కొడుకు భార్య కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలిస్తే..!

బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా లేఖరాజ్‌ తనను వదలడం లేదని, అందుకే లేఖరాజ్‌ తమ్ముడు సావ్రాను ఉపయోగించుకున్నానని సప్నా చెప్పింది. సావ్రాతో ప్రేమ నాటకం ఆడి రెచ్చగొట్టానని, అన్నయ్య లేఖరాజ్‌ను చంపాలని చెప్పానని తెలిపింది. సావ్రా, తాను తన సోదరులు అశోక్ మేఘ్వాల్, రాజు మేఘ్వాల్ కలిసి లేఖరాజ్‌పై దాడి చేశామని, కత్తి, గొడ్డలితో అతడిని చంపామని తెలిపింది. దీంతో పోలీసులు నిందితులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-08-07T19:41:58+05:30 IST