Wife: పక్కింటి వ్యక్తితో భార్య పరార్.. కిడ్నాప్ చేసిన భర్త ఎంత దారుణం చేశాడంటే.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించి..
ABN , First Publish Date - 2023-09-02T12:24:27+05:30 IST
కట్టుకున్న భార్య పట్ల తీవ్ర పగ పెంచుకున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను కిడ్నాప్ చేసి చితక్కొట్టి, ఆమెను నగ్నంగా మార్చి వీధిలో ఊరేగించాడు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు సహాయం కోసం వేడుకున్నా.. చుట్టు ఉన్న వారు పట్టించుకోలేదు.
కట్టుకున్న భార్య (Wife) పట్ల తీవ్ర పగ పెంచుకున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను కిడ్నాప్ చేసి చితక్కొట్టి, ఆమెను నగ్నంగా మార్చి వీధిలో ఊరేగించాడు. రాజస్థాన్ (Rajasthan)లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు సహాయం కోసం వేడుకున్నా.. చుట్టు ఉన్న వారు పట్టించుకోకపోగా ఆ తతంగం మొత్తాన్ని తమ సెల్ఫోన్లలో బంధించడానికి ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).
ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల గిరిజన యువతికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆ యువతి కొద్ది కాలంగా తమ పక్కింటి వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. అతడితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుంది. కొన్ని రోజుల క్రితం అతడితో వెళ్లిపోయింది. దీంతో ఆ యువతి భర్త (Husband) తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమె ఎక్కడుందో కనుక్కుని కిడ్నాప్ చేసి బలవంతంగా గ్రామానికి తీసుకొచ్చారు. భర్త, అత్తమామలు కలిసి ఆ మహిళను వివస్త్రను చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టి నడి వీధిలో ఊరేగించారు.
Viral Video: ఈ కుర్రాళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు.. క్లాస్‌లో డెస్క్ మీద మాస్ మ్యూజిక్.. షాక్ అవుతున్న నెటిజన్లు!
భర్త, అత్త మామలు దాడికి పాల్పడుతున్న సమయంలో ఆ యువతి సహాయం కోసం చుట్టుపక్కల వారిని అర్థించింది. అయినా ఎవరూ ఆ దారుణాన్ని అడ్డుకోలేదు. పైగా ఆ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించేందుకు ప్రయత్నించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.