Police: అర్ధరాత్రి పోలీసుల చెకింగ్.. కారులో డబ్బుతో పట్టుబడిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-10-21T18:16:14+05:30 IST
ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నియమావళి ప్రకారం రూ.50 వేలకు మంచి నగదను తీసుకుని ప్రయాణం చేయకూడదు.
ప్రస్తుతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) హడావిడి మొదలైంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు (Assembly Elections) జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చింది. ఆ నియమావళి ప్రకారం రూ.50 వేలకు మంచి నగదను తీసుకుని ప్రయాణం చేయకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో పోలీసులకు (Police) ఓ వ్యక్తి రూ.5 లక్షల డబ్బుతో పట్టుబడ్డాడు. అయితే అత్యాశకు పోయిన పోలీసులు తగిన మూల్యం చెల్లించారు (Crime News).
రాజస్థాన్‌లోని సున్నిత జిల్లాగా భావించే దౌసాలో పోలీసులు చెకింగ్ చేస్తుండగా వీరేంద్ర అనే వ్యాపారి కారులో రూ.5 లక్షల డబ్బు దొరికింది. అంత డబ్బు చూసి నలుగురు పోలీసుల కళ్లు చెదిరింది. ఆ వ్యాపారిని ఏమీ అడగకుండా డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రశ్నించిన వ్యాపారిని బెదిరించి చితక్కొట్టారు. రూ.1.5 లక్షలు తీసుకుని నలుగురూ సమానంగా పంచుకున్నారు.
Crime News: ఏడేళ్ల బాలికపై 65 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. ఆ బాలిక బట్టలను పరీక్షించి నిర్ధారణ.. 20 ఏళ్ల జైలు శిక్ష!
సదరు వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. నలుగురు పోలీసులు వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారి నుంచి రూ.1,50,000 రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.