Viral: భారత్ కుర్రాడు.. రష్యన్ అమ్మాయి.. కాలేజీలో మొదలైన ప్రేమాయణం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..!

ABN , First Publish Date - 2023-08-14T16:19:50+05:30 IST

ఆమె రష్యా (Russia)కు చెందిన యువతి. గతేడాది రాజస్థాన్‌ (Rajasthan)ను సందర్శించేందుకు వచ్చింది. శ్రీకృష్ణుడి (Lord Krishna)పై ఆమెకు నమ్మకం కలిగి భక్తి పెరిగింది. ఆ క్రమంలో కృష్ణ భక్తుడైన రాజస్థానీ యువకుడు మయాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది.

Viral: భారత్ కుర్రాడు.. రష్యన్ అమ్మాయి.. కాలేజీలో మొదలైన ప్రేమాయణం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..!

ఆమె రష్యా (Russia)కు చెందిన యువతి. గతేడాది రాజస్థాన్‌ (Rajasthan)ను సందర్శించేందుకు వచ్చింది. శ్రీకృష్ణుడి (Lord Krishna)పై ఆమెకు నమ్మకం కలిగి భక్తి పెరిగింది. ఆ క్రమంలో కృష్ణ భక్తుడైన రాజస్థానీ యువకుడు మయాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి దేశంలో ఉన్న ఎన్నో కృష్ణ ఆలయాలను సందర్శించారు. ఆ క్రమంలో ప్రేమలో పడ్డారు. ఇటీవల మాస్కోలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా బికనీర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు (Rajasthani boy married Russian girl).

రష్యాకు చెందిన చెందిన సైనియా అనే మహిళ ఈ ఏడాది మే నెలలో భారత్‌కు వచ్చింది. రాజస్థాన్‌లోని పలు ఆలయాలను సందర్శించిన తర్వాత ఆమెకు శ్రీకృష్ణుడిపై నమ్మకం పెరిగింది. ఆ సమయంలో ఆమెకు రాజస్థాన్‌లోని బికనీర్‌లో నివసిస్తున్న మయాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక ఇస్కాన్ దేవాలయాలను సందర్శించారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సైనియాకు రాజస్థానీ సంస్కృతి బాగా నచ్చింది. దాంతో మయాంక్‌ ప్రేమలో పడింది.

Bank Robbery: 5 నిమిషాల్లోనే 14 లక్షలు చోరీ.. సినిమాలు చూసి బ్యాంకులో దొంగతనానికి పక్కా స్కెచ్..!

మయాంక్ కూడా సైనియా ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న ఇద్దరూ మాస్కో వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం రాజస్థాన్ వచ్చారు. ఇక్కడ బికనీర్‌లో వారిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గుడిలో పైసా ఖర్చు లేకుండా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-08-14T16:19:50+05:30 IST