Viral: కష్టపడకుండానే కోట్లు సంపాదించేందుకు ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. పోలీసులే అతడిని వెతుక్కుంటూ రావడంతో..!

ABN , First Publish Date - 2023-07-11T17:10:12+05:30 IST

జీవితంలో పైకి ఎదగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం నిరంతరం కష్టపడతారు. మరికొంత మంది డబ్బులు సంపాదించేందేకు దొంగ దారులు వెతుకుతారు. అలాంటి ప్రయత్నాలు కొంత కాలం మాత్రమే సజావుగా సాగుతాయి.

Viral: కష్టపడకుండానే కోట్లు సంపాదించేందుకు ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. పోలీసులే అతడిని వెతుక్కుంటూ రావడంతో..!

జీవితంలో పైకి ఎదగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం నిరంతరం కష్టపడతారు. మరికొంత మంది డబ్బులు సంపాదించేందేకు దొంగ దారులు (Cheating) వెతుకుతారు. అలాంటి ప్రయత్నాలు కొంత కాలం మాత్రమే సజావుగా సాగుతాయి. మోసాలు చేసే వ్యక్తులు ఎప్పటికైనా శిక్షను అనుభవించాల్సిందే. రాజస్థాన్‌ (Rajasthan)కు ఓ వ్యక్తి అలాంటి ప్లానే వేసి డబ్బులు సంపాదించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన సౌరవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి ఏటీఏమ్ (ATM Center) తీసుకున్నాడు. దానిని తన ఇంట్లో పెట్టుకుని అతడే నిర్వహిస్తున్నాడు. ఆ ఏటీఎమ్ ద్వారా జరిగే లావాదేవీల మీద కమిషన్ తీసుకుంటాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే సౌరవ్ ఆ ఏటీఎమ్‌ను ప్రజల కోసం కాకుండా సైబర్ దుండగుల (Cyber Criminals) కోసం నిర్వహించేవాడు. బ్యాంకు వ్యక్తులు ఎప్పటికప్పుడు ఆ మెషిన్‌లో డబ్బులో నింపుతున్నా సౌరవ్ మాత్రం ఎప్పుడూ ఆ ఏటీఎమ్ షట్టర్‌ను మూసే ఉంచేవాడు. ఎవరైనా అడిగితే మెషిన్‌లో డబ్బులు లేవని చెబుతుండేవాడు.

Viral News: ఓ బాబును ఎత్తుకుని లాలిస్తున్న పోలీస్ కానిస్టేబుల్.. సడన్‌గా ఈమె ఫొటో వైరల్‌గా మారడం వెనుక కథేంటంటే..!

వాస్తవానికి సౌరవ తన, తన కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతా నంబర్లను భరత్‌పూర్, ధౌల్‌పూర్, మేవాత్ ప్రాంతాలకు చెందిన సైబర్ దుండగులకు ఇచ్చాడు. ఆ సైబర్ దుండగులు అనేక మార్గాల ద్వారా సౌరవ్, అతడి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసేవారు. అప్పుడు సౌరవ్ తన దగ్గర ఉన్న ఏటీఎమ్ మెషిన్‌లోని డబ్బులను ఏటీఎం కార్డుల ద్వారా విత్‌డ్రా చేసి వారికి ఇచ్చేవాడు. అందుకు వారి నుంచి 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు సౌరవ్ ఇలాగే చేశాడు. చివరకు రాష్ట్ర సీఐడీకి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు (Crime News).

Updated Date - 2023-07-11T17:10:12+05:30 IST