Raksha Bandhan 2023: రాఖీ పండుగ ఎప్పుడు..? ఆగస్టు 30 నా..? లేక 31వ తారీఖునా..? అసలు ఏ తేదీలో జరుపుకోవాలంటే..!
ABN , First Publish Date - 2023-08-08T12:28:04+05:30 IST
రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.
భారతీయ పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబమంతా కలసి జరుపుకునే పండుగలు ఎన్నో ఉన్నాయి. కానీ రాఖీ పండుగ మాత్రం ప్రత్యేకమైనది. ఇది సోదరసోదరీమణుల మధ్య బంధాన్ని దృఢంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమరోజును రాఖీ పండుగగా జరుపుకోవడం పరిపాటి. అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు ఈ పండుగరోజున తమ ప్రేమానురాగాలను చాటిచెబుతుంటారు. అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ములు బాగుండాలని రక్ష కడితే.. తామెప్పుడూ తమ తోబుట్టువులకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు. అయితే రాఖీ పండుగ ఎంత గొప్పదో దాన్ని జరుపుకునే సమయం అంతకంటే ముఖ్యమైనది. ఈ కారణంగా రాఖీ పండుగ విషయంలో ఈ ఏడాది గందరగోళం నెలకొంది. రాఖీపండుగ 30వతేదీనా లేక 31వ తేదీనా అనేది అర్థం కావడం లేదు. ఈ గందరగోళం తొలగించి రాఖీ పండుగ ఎప్పుడో తెలుసుకుంటే..
రాఖీ పండుగ.. భధ్రకాలం..
రాఖీ పండుగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30నా, 31నా అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది. అంటే 30,31 రెండురోజులలో పౌర్ణమి ఉంది. అయితే 30తేదీ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవ్వరూ చేయకూడదు.
Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!
భద్రకాలం అంటే..
భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే.ఈయన సోదరి భద్ర. ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు.
రాఖీ ఎప్పడు కట్టాలంటే..
పౌర్ణమి ప్రకారం రాఖీ పండుగ 30,31 రెండు తేదీలలో వచ్చింది. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.