Home » Rakhi festival
రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, మట్టా రాగమయి
అక్కలతో రాఖీలు కట్టించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన చిన్నారికి గురుకుల పాఠశాల సిబ్బంది చుక్కలు చూపించారు.
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..
రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఆగస్టు-19న ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచే జరగాలని ప్రార్థిస్తారు..
Telangana: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ హాస్పిటల్ లో రక్షాబధన్ వేడుకలు జరుపుకున్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
Telangana: సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Andhrapradesh: రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ .. రక్త సంబంధం లేకపోయినా.. వైఎస్సార్ అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగ నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ... రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు’’ అని తెలిపారు.
Telangana: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీకట్టేందుకు ఉత్సహం చూపుతున్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుని రక్తంపంచుకు పుట్టిన సోదరులకు రాఖీలు కట్టి బహుమతులు అందుకుంటున్నారు. అలాగే వారి ఆశీర్వచానలు పొందుతున్నారు.
ఆగస్టు 19 వ తేదీ సోమవారం భారతదేశం అంతా రాఖీ పూర్ణిమ హేళలో మునిగిపోతుంది. కానీ ప్రపంచం మాత్రం ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూడటానికి సంసిద్దమవబోతోంది. దీనికి కారణం సూపర్ బ్లూ మూన్.
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.