Raveena Tandon: ‘రేప్ సీన్ చేసిన ఒక్క చిరుగు ఉండేది కాదు.. అది నేను’

ABN , First Publish Date - 2023-02-07T12:26:39+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో రవీనా టాండన్ () ఒకరు. 1990లలో అయితే ఈ నటి అంటే అప్పటి యువత పడిచచ్చిపోయేది.

Raveena Tandon: ‘రేప్ సీన్ చేసిన ఒక్క చిరుగు ఉండేది కాదు.. అది నేను’
Raveena Tandon

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో రవీనా టాండన్ (Raveena Tandon) ఒకరు. 1990లలో అయితే ఈ నటి అంటే అప్పటి యువత పడిచచ్చిపోయేది. ముఖ్యంగా అందంతో పాటు అభినయంతోనూ వారి హృదయాలను కొల్లగొట్టింది. అంతేకాకుండా పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో ఎక్కువగా ఓటీటీ కంటెంట్, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది. ఈ తరుణంలో తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో ఆమెకి ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది.

రవీనా మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభం నుంచి నాకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. సినిమాల్లో కొన్నింటి విషయంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి వాటిని చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసేదాన్ని. ముఖ్యం డ్యాన్స్‌ విషయానికొస్తే నచ్చని మూవ్‌మెంట్ చేయాలన్నా.. సన్నివేశం కోసం స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించడానికీ ఇబ్బంది పడేదాన్ని. అలాగే ముద్దు సీన్లలో కూడా నటించలేదు. దాని వల్ల నాపై అహంకారి అనే ముద్ర వేశారు. కొన్ని అవకాశాలు కూడా కోల్పోయాను. అలాగే నేను రెండు రేప్‌ సన్నివేశాల్లో నటించాను. అయినా వాటిలో ఎలాంటి అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా రేప్‌ సీన్స్‌లో నటించిన నటిని నేనొక్కదాన్నే. కాస్ట్యూమ్స్‌ అంతలా కచ్చితంగా ఉండేదాన్ని’ అని ఆమె తెలిపింది. అలాగే.. బాడీ షేమింగ్ గురించి రవీనా మాట్లాడుతూ.. ‘నేను 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అప్పటి నుంచి నా శరీరంలో కొంచెం కొవ్వు ఉండేది. అది ఇంకా పోలేదు. దాని వల్ల నాపై బాడీ షేమింగ్ (body shaming) కూడా జరిగింది. అప్పుడు కొంచెం బాధ పడినా.. ఇప్పుడైతే పట్టించుకోవడం మానేశా’ అని తెలిపింది.

Updated Date - 2023-02-07T12:26:41+05:30 IST