Share News

Relationship Advice: భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే చాలు.. వారి సంతోషానికి ఢోకా ఉండదు!

ABN , Publish Date - Dec 19 , 2023 | 04:36 PM

ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు.

Relationship Advice: భార్యాభర్తలు ఈ 4 పనులు చేస్తే చాలు.. వారి సంతోషానికి ఢోకా ఉండదు!

ప్రపంచంలో భార్యాభర్తల బంధానికి చాలా గొప్ప ప్రాధ్యాన్యత ఉంది. జీవితం మధ్యలో ముడిపడే వివాహ బంధం ఇద్దరిని ఒకటిగా జీవితాంతం వరకు నడిపిస్తుంది. అయితే నేటికాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. విచిత్రం ఏమిటంటే బాగా చదువుకున్నామని, మాకు జీవితం మీద స్పష్టత ఉందని చెప్పేవారే వివాహ జీవితంలో చాలామటుకు విఫలం అవుతున్నారు. ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా భార్యాభర్తలు తమ బంధాన్ని సురక్షితంగా ఉంచుకోవాలన్నా, జీవితాన్ని సంతోషంగా గడపాలన్నా కేవలం నాలుగు పనులు చేస్తే చాలు.

ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్..

భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ ఎంత ఆరోగ్యంగా ఉంటే వారి బంధం అంత బాగుంటుంది. ఏ విషయం అయినా చెప్పాలన్నా, చేయాలన్నా, చర్చించాలన్నా అది గొడవ పడినట్టు, వేలెత్తి చూపినట్టు, నిందించినట్టు కాకుండా అర్థం చేసుకునేలా మెల్లిగా చెప్పాలి. తద్వారా ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కరించుకోవడం నుండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వరకు అన్నీ సవ్యంగా జరుగుతాయి.

ఇది కూడా చదవండి: Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..



ఒకరినొకరు గౌరవించుకోవాలి..

భార్యాభర్తలలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవాలి. ఇద్దరు ఒకరికోసం ఒకరన్నట్టు ఉండాలి. అంతేకానీ సంపాదిస్తున్నా కాబట్టి నేనే ఎక్కువ అని ఒకరంటే.. వండి పెడుతున్నా నేనే ఎక్కువ అని మరొకరు అనడం చేయకూడదు. ఇది ఇద్దరి మధ్య అగాధాన్ని ఏర్పరుస్తుంది.

మూడవ వ్యక్తిని బంధంలోకి రానివ్వకూడదు..

భార్యాభర్తలు వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలలో ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోయినా, దానివల్ల ఇబ్బందిగా ఉన్నా అదే విషయాన్ని కూర్చుని చర్చించాలి. అర్థమయ్యేలా మెల్లగా చెప్పాలి. ఇద్దరి గొడవలో జడ్జ్మెంట్ కోసం మూడవ వ్యక్తిని ఆశ్రయించడం, గొడవ గురించి షేర్ చేసుకోవడం చేయకూడదు. దీనివల్ల భార్యభర్తల బంధం ఇతరుల ముందు చులకన అయిపోవడమే కాదు.. ఇతరులు చెప్పే నిర్ణయాల వల్ల బంధం బీటలు వారుతుంది. భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి గౌరవం పోతుంది.

ఇది కూడా చదవండి: Dinner Facts: రాత్రిపూట పొరపాటున కూడా ఈ 5 ఆహారాలు తినకండి.. లేకపోతే చాలా నష్టపోతారు!!


ప్రేమను వ్యక్తపరచడం..

భార్యాభర్తలు తమ భాగస్వాముల మీద తమకున్న ప్రేమను వ్యక్తపరచడంలో పలు విధాలుగా ఆలోచిస్తారు. ప్రేమను వ్యక్తం చేస్తే చిన్నతనం అయిపోతామని కొందరు అనుకుంటారు. మొహమాటం కొద్దీ మరికొందరు చెప్పలేరు. నేనెందుకు చెప్పాలి అనే అహం మరికొందరిలో ఉంటుంది. ఇవన్నీ కాకుండా భాగస్వామి మీద ఉన్న ప్రేమను సందర్బానుసారంగా వ్యక్తం చేస్తుంటే వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ ఒక్క పని వల్ల ఎన్నేళ్లు గడిచినా కొత్త జంట అనే ఫీల్ వచ్చేలా ఉంటారు.

మరిన్ని వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 19 , 2023 | 04:36 PM