Relationship Advice: ఎప్పుడూ ఉండే సమస్యలే కదా అని లైట్ తీసుకోవద్దు.. ఈ 4 టిప్స్‌ను పాటిస్తేనే సంసార జీవితం ఫుల్లు హ్యాపీ..!
ABN , First Publish Date - 2023-12-01T15:53:33+05:30 IST
భర్త మీద భార్య, భార్య మీద అరుచుకోవడం, కోపతాపాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఈ 4 టిప్స్ ఫాలో అయితే మాత్రం సంతోషానికి ఢోకా ఉండదు.
పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన దశ. పెళ్లయిన కొత్తలో అన్ని జంటలు బానే ఉంటాయి. కానీ కాలం గడిచేకొద్ది ఇద్దరి మద్య అపార్జాలు, గొడవలు వస్తుంటాయి. భర్త మీద భార్య, భార్య మీద అరుచుకోవడం, కోపతాపాలు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ మామూలే అని లైట్ తీసుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ వైవాహిక జీవితం ఫుల్లు హ్యాపీగా ఉంటే జీవితంలో చెప్పలేనంత తృప్తి, ఎన్ని సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించవచ్చు. భార్యాభర్తలు ఈ 4 టిప్స్ ఫాలో అయితే చాలు.. సంసార జీవితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అవేంటో తెలుసుకుంటే..
భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న విషయాలే వారిని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఉదయాన్నే బాత్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే వారికి సర్ప్రైజ్ కలిగేలా భాగస్వామి పేరును నోట్ రూపంలో ఉంచవచ్చు. ఇది చాలా రొమాంటిక్ ఫీల్ కలిగిస్తుంది. అలాగే సరదాగా బయటకు డిన్నర్ కు తీసుకెళ్లవచ్చు. స్వయంగా ఆహారాన్ని వడ్డించవచ్చు. దీనివల్ల వారెంతో సంతోషపడతారు.
ఇది కూడా చదవండి: Curry Leaves: పొద్దున్నే నాలుగు కరివేపాకు రెమ్మలను పరగడుపున నమిలితే.. ఆ సమస్య అసలు రానే రాదు..!
ఆదివారమంటే ఖాళీగా ఉండటమే. అయితే ఆ రోజు కూడా ఏవో ఒక పనులు పెట్టుకోకుండా సరదాగా చిన్న టూర్ కు లేదా నైట్ డిన్నర్ కు వెళ్లవచ్చు. ఈ సమయం ఇద్దరి మద్య బంధాన్ని ధృడం చేస్తుంది.
మనిషి మీద ప్రేమ ఉంటే సరిపోదు. దాన్ని బయటకు వ్యక్తం వేస్తేనే చాలామంది సంతోషిస్తారు. అందుకే సోషల్ మీడియాలో భాగస్వాములు తమ ఫోటోలను షేర్ చేయడం, మెచ్చుకోవడం, వారి సహకారాన్ని తెలియజెప్పడం చేయాలి. వారికోసం ఓ అందమైన ఫోటో ఆల్బమ్ కూడా క్రియేట్ చేయవచ్చు.
పెళ్లై ఒక సంవత్సరం గడిస్తే చాలు చాలామంది భాగస్వాముల పుట్టినరోజులు, పెళ్లిరోజులు మరచిపోతుంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవాలి. వాటిని గుర్తుంచుకుని ఆ రోజులను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి.