Viral: ఏంది సామీ ఇది.. కేక్ కట్ చేసినందుకు అంత దోపిడీనా? రెస్టారెంట్ బిల్లు చూసి అవాక్కైన కస్టమర్లు!

ABN , First Publish Date - 2023-08-21T11:05:00+05:30 IST

ప్రస్తుతం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అడపాదడపా రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. సాధారణంగా మనం తిన్న ఫుడ్‌కు, ట్యాక్సులు కలిపి రెస్టారెంట్లు బిల్లు ఇస్తుంటాయి. అయితే ఇటలీలోని ఓ రెస్టారెంట్ కేక్‌ను 20 ముక్కలుగా చేయమన్నందుకు ఏకంగా రూ.1800 సర్వీస్ ఛార్జ్ వేసింది.

Viral: ఏంది సామీ ఇది.. కేక్ కట్ చేసినందుకు అంత దోపిడీనా? రెస్టారెంట్ బిల్లు చూసి అవాక్కైన కస్టమర్లు!

ప్రస్తుతం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అడపాదడపా రెస్టారెంట్లకు (Restaurants) వెళ్లి భోజనం చేయడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. సాధారణంగా మనం తిన్న ఫుడ్‌కు, ట్యాక్సులు కలిపి రెస్టారెంట్లు బిల్లు ఇస్తుంటాయి. అయితే ఇటలీ (Italy)లోని ఓ రెస్టారెంట్ వీటితో పాటు సర్వీస్ ఛార్జ్ (Service Charge) పేరిట కూడా కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేస్తోంది. కేక్‌ (Cake)ను 20 ముక్కలుగా చేయమన్నందుకు ఏకంగా రూ.1800 సర్వీస్ ఛార్జ్ వేసింది. ఆ రెస్టారెంట్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటలీలోని లారియోలో ఉన్న బార్ పేస్ అనే రెస్టారెంట్‌కు ఓ కుటుంబ సభ్యులు బర్త్ డే పార్టీ కోసం వెళ్లారు. పిజ్జా, వైన్, బీర్, కేక్ తీసుకున్నారు. మొత్తం బిల్లు 121 యూరోలు అయింది. అయితే బిల్లులో కేక్ కటింగ్ సర్వీస్ ఛార్జ్ పేరిట 20 యూరోలు ఉండడం వారిని షాక్‌కు గురి చేసింది (Charges for slicing a cake). ఆ సర్వీస్ ఛార్జ్ ఏంటని అడిగితే .. కేక్‌ను 20 ముక్కలుగా కట్ చేసేందుకు సర్వీస్ చార్జీ 20 యూరోలు (1800 రూపాయలు) అని రెస్టారెంట్ సిబ్బంది వెల్లడించారు. షాకైన కుటుంబ సభ్యులు ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral Video: సింహాలు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తిపై సింహం ఎంత ప్రేమ కురిపిస్తోందో చూడండి.. నెటిజన్లు షాక్!

ఆ రెస్టారెంట్ దోపిడీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసినందుకు ఛార్జ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇటాలియన్ రెస్టారెంట్లు భారీగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఓ కస్టమర్ శాండ్‌విచ్‌ను రెండు భాగాలు కట్‌ చేయమని అడిగినందుకు అదనంగా ఛార్జ్‌ చేశారు. శాండ్‌విచ్ కట్ చేసినందుకు ఛార్జ్ ఎందుకని నిలదీయగా.. శాండ్‌విచ్ కట్ చేసేందుకు రెండు సాసర్లు, రెండు న్యాప్‌కిన్‌లు ఉపయోగించాల్సి ఉంటుందని, ఆ తర్వాత టేబుల్‌ వద్దకు వెళ్లి అందించాల్సి ఉంటుందని చెప్పారు.

Updated Date - 2023-08-21T11:05:00+05:30 IST