కారును ఏ గేరులో ఉంచి, ఓవర్ టేక్ చేయాలి?.. దీనికి ఉండే ఈ పద్దతులు తెలియకపోతే ప్రమాదం తప్పదు!

ABN , First Publish Date - 2023-04-13T10:35:56+05:30 IST

ముందునున్న వాహనాన్ని ఓవర్‌టేక్(Overtake) చేయడానికి సరైన విధానం ఏమిటి? ఆ సమయంలో మీరు కారును ఏ గేర్‌లో ఉంచాలి? ఒకటి కంటే ఎక్కువ లేన్ ఉన్న చోట కుడి లేన్ ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి రహదారిపై(on the road) సులభంగా ఓవర్ టేక్ చేయవచ్చు.

కారును ఏ గేరులో ఉంచి, ఓవర్ టేక్ చేయాలి?.. దీనికి ఉండే ఈ పద్దతులు తెలియకపోతే ప్రమాదం తప్పదు!

ముందునున్న వాహనాన్ని ఓవర్‌టేక్(Overtake) చేయడానికి సరైన విధానం ఏమిటి? ఆ సమయంలో మీరు కారును ఏ గేర్‌లో ఉంచాలి? ఒకటి కంటే ఎక్కువ లేన్ ఉన్న చోట కుడి లేన్ ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి రహదారిపై(on the road) సులభంగా ఓవర్ టేక్ చేయవచ్చు. అలాంటి రోడ్లపై ఓవర్ టేక్(Overtake) చేయడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే మీరు ఒకే లేన్ రహదారిపై డ్రైవింగ్ చేస్తుంటే, అక్కడ ముందుకు వెళ్లేందుకు ఒక లేన్ మాత్రమే ఉంటుంది.

ఇక్కడ ఓవర్‌టేక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రోడ్లపై ప్రమాదాలు(Accidents) జరగకుండా ఉండాలంటే అతి త్వరగా ఓవర్ టేక్ చేసి. మళ్లీ మీ లేన్‌కు మీరు రావాల్సి ఉంటుంది. సింగిల్ లేన్ రోడ్డులో ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు మీరు డౌన్‌షిఫ్ట్(Downshift) చేయాల్సి రావచ్చు. త్వరిత ఓవర్‌టేక్‌ల కోసం వాహనానికి ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది. ఇది అధిక RPM వద్ద అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే, అధిక గేర్‌లో వాహనం తక్కువ RPMలో నడుస్తుంది. కాగా ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఎక్కువ RPM అవసరం. ఒకవేళ మీరు మీ కారును నాల్గవ గేర్‌(Fourth gear)లో గంటకు 60 కి.మీ వేగంతో నడుపుతున్నారని అనుకుందాం.

మీరు ఈ గేర్‌లో కారును వేగవంతం చేస్తే, కారు వేగాన్ని అందుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరంగా మారవచ్చు. నాలుగు నుంచి మూడో గేర్‌కి మారడం ద్వారా కారును ఓవర్‌టేక్ చేస్తే త్వరగా ఓవర్‌టేక్ చేయగలుగుతారు. అధిక ఇంజిన్ సామర్థ్యం(Engine efficiency) ఉన్న కార్లలో ఇలా చేయవలసిన అవసరం లేదు. కానీ చాలా సందర్భాలలో ఈ పద్ధతి అవసరం అవుతుంది.

ఇదేకాకుండా డీజిల్ ఇంజన్, టర్బో ఛార్జ్డ్ పెట్రోల్(Turbo charged petrol) ఇంజన్‌లలో తక్కువ rpm వద్ద మంచి టార్క్ కూడా లభిస్తుంది. అందుకే ఇలాంటి కార్లలో కూడా డౌన్ షిఫ్ట్ అవసరం తక్కువ. అంతే కాకుండా ఓవర్‌టేక్ చేసేటప్పుడు లైట్లు వెలిగించి సిగ్నల్ పాస్ కూడా ఇవ్వాలనే విషయం గుర్తుంచుకోండి.

Updated Date - 2023-04-13T11:11:55+05:30 IST