Dasara: సినిమాపై హైప్ పెంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

ABN , First Publish Date - 2023-03-05T18:03:04+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న సినిమా ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓడెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dasara: సినిమాపై హైప్ పెంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న సినిమా ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓడెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే, ‘దసరా’‌ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఆయన తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత పదేళ్లలో తాను విన్న గొప్ప స్క్రిఫ్ట్ ఇదేనని చెప్పారు.

Dasara.jpg

‘‘నేను గత పదేళ్లలో టాలీవుడ్ నుంచి దాదాపు 90స్క్రిఫ్ట్స్‌ విన్నాను. ఈ అన్ని స్క్రిఫ్ట్స్‌లో ‘దసరా’ నే బెస్ట్. ప్రజలందరు ఈ సినిమాను చూసి సంబరాలు చేసుకోవాలనుకుంటున్నాను. కోలీవుడ్‌లో బాలు మహేంద్ర, వెట్రి మారన్, పా రంజిత్ వంటి అనేక మంది దర్శకులు రియలిస్టిక్ చిత్రాలను తెరకెక్కించారు. శ్రీకాంత్ కూడా ఆ కేటగిరికే చెందుతారు’’ అని సంతోష్ నారాయణన్ తెలిపారు. నానికి మహారాష్ట్రలో భారీ స్థాయిలో అభిమానులున్నారు. ఆ ఫ్యాన్స్ ఈ మధ్యనే ‘దసరా’ లుక్‌ను రంగోలి వేశారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నాని ఈ చిత్రంలో సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నారు. ఈ మూవీలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌‌గా అవినాష్‌ కొల్లా పని చేస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-05T18:03:04+05:30 IST