Fish With 24 Eyes: ఒక ఇంచి కూడా లేని చేపకు 20కు పైగా కళ్లు... ఇంకా ఆశ్చర్యపరిచే ప్రత్యేకతలివే..
ABN , First Publish Date - 2023-04-25T10:59:56+05:30 IST
Fish With 24 Eyes: చేపలలో అనేక రకాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. వాటిలో కొన్ని వింత చేపలు(strange fish) కూడా ఉన్నాయి.
Fish With 24 Eyes: చేపలలో అనేక రకాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. వాటిలో కొన్ని వింత చేపలు(strange fish) కూడా ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చే మరో చేప ఇటీవల శాస్త్రవేత్తల కంట పడింది. మిర్రర్(Mirror) తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు(Baptist University scientists) జెల్లీ ఫిష్ జాతికి చెందిన విచిత్రమైన చేపను కనుగొన్నారు. దాని ఆకృతి శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది.
ఓషన్ పార్క్ హాంకాంగ్, యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్, WWF-హాంకాంగ్‌తో కలిసి పరిశోధకుల బృందం(team of researchers) ఈ చేపపై మరింతగా పరిశోధనలు సాగిస్తున్నది. ఈ చేప జెల్లీ ఫిష్ కుటుంబానికి చెందినదని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. ఈ చేప పరిమాణం ఒక అంగుళం కన్నా తక్కువగానే ఉంది. ఈ చేపకు 24 కళ్ళున్నాయి.
చేప శరీరంలో మొత్తం 3 టెంటకిల్స్, 24 కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు 6-6, 4 సమూహాలుగా ఉన్నాయి. ప్రతి సమూహంలో 2 కళ్లలో మాత్రమే లెన్స్‌లు(Lenses) ఉన్నాయి. మిగిలిన కళ్ళు మాత్రమే కాంతిని గ్రహిస్తాయి. ప్రొఫెసర్ క్యూ తెలిపిన వివరాల ప్రకారం ఇది ఒక ప్రత్యేక తరహా చేప. ఈ రకమైన బాక్స్ జెల్లీ ఫిష్ ఫ్లోరిడా, సింగపూర్, జమైకా(Jamaica), భారతదేశం, ఆస్ట్రేలియాలలో కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో మొత్తం 49 జల్లీ ఫిష్ జాతులు ఉన్నాయి.