Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్టులో రేఖ..!

ABN , First Publish Date - 2023-02-23T16:45:50+05:30 IST

బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్ ‘హీరామండి’ (Heeramandi). నెట్‌ఫ్లిక్స్ ఇండియా కోసం ఆయన రూపొందిస్తున్నారు. స్వాత్వంత్ర్యానికి పూర్వం వేశ్యల కథతో తెరకెక్కనుంది.

Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్టులో రేఖ..!

బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్ ‘హీరామండి’ (Heeramandi). నెట్‌ఫ్లిక్స్ ఇండియా కోసం ఆయన రూపొందిస్తున్నారు. స్వాత్వంత్ర్యానికి పూర్వం వేశ్యల కథతో తెరకెక్కనుంది. మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ షోలో సీనియర్ నటి రేఖ (Rekha) నటించనుందని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. కానీ, ఆమె వెబ్‌సిరీస్‌లో నటించడానికి అంగీకరించలేదు. తాజాగా ఆమెకు సంబంధించిన మరో అప్‌డేట్ బాలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది.

సినిమాలతో పాటు పాటలను భారీగా చిత్రీకరిస్తారని సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. ఈ వెబ్‌సిరీస్‌లోని సాంగ్స్ అదే విధంగా ఉండనున్నాయట. అందులో భాగంగా ఓ పాటలో నటించామని రేఖ‌ను భన్సాలీ కోరారట. ప్రస్తుతానికి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం అందుతుంది. కానీ, అది చాలా చిన్న పాత్రేనట. అందువల్ల ఆమె అంగీకారం తెలుపుతుందో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘హీరామండి’ ఫస్ట్‌లుక్, టీజర్‌ను మేకర్స్ ఈ మధ్యనే విడుదల చేశారు. టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ.. ‘‘సంజయ్ లీలా భన్సాలీ క్రియేట్ చేసిన కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నాం. అందమైన ‘హీరామండి’ గ్లింఫ్స్‌ను చూడండి. అతి త్వరలోనే ఈ షో మీ ముందుకు వస్తుంది’’ అని మేకర్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-23T16:45:53+05:30 IST