Sharwanand engagement: సింగిల్ లైఫ్‌కు స్వస్తి!
ABN , First Publish Date - 2023-01-26T12:55:38+05:30 IST
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్ లైఫ్ జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్ (Sharwanand engagement) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్ లైఫ్ (Full stop to single life) జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో (Rakshitha reddy) ఆయన ఏడడుగులు వేయనున్నారు. గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇరువైపు కుటుంబాల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్‌చరణ్, ఆయన సతీమణి, ఉపాసన తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు, శర్వా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(Sharwanand)