రైల్లో దుప్పట్లు, బెడ్ షీట్లు ఎత్తుకెళ్లిపోతే.. ఎటువంటి శిక్ష పడుతుందంటే..

ABN , First Publish Date - 2023-04-03T06:50:19+05:30 IST

రైల్వేకు సంబంధించిన వస్తువులను ఎవరైనా దొంగిలిస్తే వారిని శిక్షించేందుకు రైల్వేకు ఒక చట్టం(law) ఉంది. దాని సహాయంతో భారతీయ రైల్వేలు వారికి శిక్ష విధిస్తాయి.

రైల్లో దుప్పట్లు, బెడ్ షీట్లు ఎత్తుకెళ్లిపోతే.. ఎటువంటి శిక్ష పడుతుందంటే..

రైల్వేకు సంబంధించిన వస్తువులను ఎవరైనా దొంగిలిస్తే వారిని శిక్షించేందుకు రైల్వేకు ఒక చట్టం(law) ఉంది. దాని సహాయంతో భారతీయ రైల్వేలు వారికి శిక్ష విధిస్తాయి. ఆ చట్టమే రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966(Railway Property Act 1966). ఈ చట్టం ప్రకారం ఎవరైనా రైల్వేకి సంబంధించిన ఏదైనా ఆస్తిని దొంగిలించినా లేదా ధ్వంసం చేసినా వారిపై చర్యలు తీసుకోవచ్చు.

ఈ నేరానికి నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా(fine) విధించే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు రెండూ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. గరిష్ట శిక్ష విషయానికి వస్తే ఇది 5 సంవత్సరాలు. పశ్చిమ రైల్వే జోన్(Western Railway Zone) గతంలో కొన్ని గణాంకాలు విడుదల చేసింది. దాని ప్రకారం 2017 2018 మధ్య కాలంలో రైల్వేకు చెందిన 1.95 లక్షల టవల్స్, 81,776 బెడ్ షీట్లు(Bed sheets), 5,038 దిండ్లు, 7,543 దుప్పట్లు చోరీకి గురయ్యాయి.

దీనిని చూస్తే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుంది. అందుకే మీరు రైలులో ప్రయాణించేటప్పుడు ఎవరైనా ఇలాంటి పనిచేస్తే వారిని వారించండి. లేదా రైల్వే విభాగానికి(Railway Division) సమాచారం అందించండి. బాధ్యతగల దేశ పౌరునిగా మీరు చేయవలసిన పని ఇదేనని గ్రహించండి.

Updated Date - 2023-04-03T10:24:13+05:30 IST