Shivaleeka Oberoi: స్టార్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్
ABN , First Publish Date - 2023-02-10T17:50:53+05:30 IST
బాలీవుడ్లో ఈ ఏడాది వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా అడ్వాణీ- సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఏడడుగులు వేశారు.
బాలీవుడ్లో ఈ ఏడాది వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా అడ్వాణీ- సిద్దార్థ్ మల్హోత్రాలు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఏడడుగులు వేశారు. ‘దృశ్యం 2’ (Drishyam 2) హిందీ వెర్షన్‌ను తెరకెక్కించిన అభిషేక్ పాఠక్ (Abhishek Pathak), హీరోయిన్ శివలీకా ఒబెరాయ్ (Shivaleeka Oberoi)ని పెళ్లి చేసుకున్నారు. గోవాలో అత్యంత వైభవంగా ఈ వివాహం జరిగింది. టర్కీలో గతేడాది సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. అభిషేక్, శివలీకా వివాహానికి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులందరు షేర్ చేస్తున్నారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను శివలీకా ఒబెరాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ నోట్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రేమను మీరు కనిపెట్టలేరు. ప్రేమే మిమ్మల్ని కనిపెడుతుంది. విధి, తల రాత, ఆకాశంలోని నక్షత్రాలు మా బంధాన్ని నిర్ణయించాయి. అత్యంత ఆప్తుల మధ్య ఫిబ్రవరి 9న మేం పెళ్లి చేసుకున్నాం. మా జీవితంలోని అత్యంత అద్భుతమైన క్షణమిది. ప్రేమ, అనేక జ్ఞాపకాలతో మా హృదయం నిండింది. జీవితంలోని మరో ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు మాకుండాలి’’ అని శివలీకా తెలిపారు. ‘ఖుదా హఫీజ్ 1’, ‘ఖుదా హఫీజ్ 2’ సినిమాల్లొ శివలీకా హీరోయిన్గా నటించారు. ఈ రెండు చిత్రాలకు అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఫలితంగా ఏడడుగులు వేశారు.