Shocking: వీళ్లు మనుషులే.. కానీ కాళ్లేంటి ఇలా ఉన్నాయ్..? అందరికీ అదే సీన్ రిపీట్.. అసలు కారణమేంటంటే..!

ABN , First Publish Date - 2023-08-25T16:09:12+05:30 IST

ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు.

Shocking: వీళ్లు మనుషులే.. కానీ కాళ్లేంటి ఇలా ఉన్నాయ్..? అందరికీ అదే సీన్ రిపీట్.. అసలు కారణమేంటంటే..!

మనిషన్నాక రెండు కాళ్లు ఉంటాయి. ఒక్కో కాలికి ఐదు వేళ్ళు ఉంటాయి. ఏదో జన్యు సమస్య వల్ల ఎవరికైనా ఓ వేలు అదనంగా ఉంటే ఇండోచ్చు కానీ అక్కడి ప్రజలు మాత్రం అందుకు విభిన్నం. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు. ఇతర మనుషుల్లాగే భూమి మీద నివసిస్తున్నారు. పాపం వీరికున్న సమస్య కారణంగా చెప్పులు వేసుకోవడానికే కాదు, సాధరణంగా నడవడానికి కూడా అష్టకష్టాలు పడుతున్నారు. వీళ్ల పరిస్థితి గురించి విన్నవారు ఇదేం వింత అని విస్తుపోతున్నారు. అసలు వీళ్లెవరు? వీళ్లకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? పూర్తీగా తెలుసుకుంటే..

ప్రపంచంలోని మనుషులకు రూపురేఖలు వేరుగా ఉన్నా భౌతిక శరీరం మాత్రం ఒకే విదంగా ఉంటుంది. రెండు కాళ్లు, రెండు చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇలా మనుషులకు అందరికీ ఉండే శరీర నిర్మాణం ఇది. కానీ జింబాబ్వే(Zimbabwe) దేశానికి ఉత్తర భాగంలో ఉండే కయెంబా ప్రాంతంలో ఒక వింత తెగ ఉంది. ఈ తెగలోని వారి పాదాలకు కేవలం రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి(only two fingers for leg). ఈ తెగలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి సమస్య ఉన్నా అది పెద్ద వింత కాదులే అనుకోవచ్చు. కానీ ఎన్ని ఏళ్ళు గడుస్తున్నా ఈ తెగలో పుడుతున్న వారందరికీ ఇదే సమస్య ఉండటం ప్రపంచాన్ని అయోమయానికి గురిచేస్తోంది. పాదాలు సాధారణంగా మనుషులందరికీ ఉన్నట్టే ఉన్నా వేళ్లు మాత్రం పెద్ద పరిమాణంలో రెండే రెండున్నాయి. ఈ వేళ్ళు కూడా పెద్ద పరిమాణంలో పొడవుగా పక్షుల కాలివేళ్ళలా ఉన్నాయి. ఈ తెగను వడోమా తెగ అని పిలుస్తారు. కాలి వేళ్ళ నిర్మాణ నిర్మాణం ఇలా ఉన్న కారణంగా వీళ్ళు చెప్పులు వేసుకోవడానికి, కనీసం అందరిలా చక్కగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!



ఈ తెగకు సంబంధించిన ఫోటోలను Glamparte_ అనే ట్విట్టర్ అకౌంట్(Twitter X) లో షేర్ చేశారు. కాగా ఈ తెగ పాదాలకున్న సమస్య గురించి కొందరు వైద్యులు వివరణ ఇస్తున్నారు. దీన్ని 'ఎక్ట్రోడాలీ' లేదా 'ఆస్ట్రిచ్ ఫుట్ సిండ్రోమ్' అని కూడా అంటారని చెబుతున్నారు. ఈ సమస్యను ఫుట్ మాల్ ఫార్మేషన్ అని కూడా అంటారు. ఇది జన్యు లోపం వల్ల వచ్చే సమస్య అని తెలిసింది. అయితే ఈ సమస్య ఉన్నవారు చెట్లు ఎక్కడంలో మంచి నిష్టాతులు అని వీరి మీద పరిశోధన చేసినవారు అంటున్నారు.

Viral video: ఇంత ధైర్యమేంటయ్యా బాబూ.. చెట్ల పొదల్లో దాక్కున్న కొండచిలువను ఒంటి చేత్తో బయటకు లాగితే..!


Updated Date - 2023-08-25T16:09:12+05:30 IST