Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పకూలిన గోల్డ్ మైన్.. మట్టిలో ఇరుక్కుపోయిన కార్మికులను ఎలా కాపాడారో చూడండి..!
ABN , First Publish Date - 2023-03-29T16:37:40+05:30 IST
బొగ్గు గనుల్లోనూ, బంగారు గనుల్లోనూ పని చేసే కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. చిట్ట చీకటిలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని గాలి ఆడని సొరంగాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారు.
బొగ్గు గనుల్లోనూ, బంగారు గనుల్లోనూ (Gold Mines) పని చేసే కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. చిట్ట చీకటిలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని సొరంగాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారు. ఇతర దేశాల్లో కనీస జాగ్రత్తలైనా తీసుకుంటారు. కానీ, పేద ఆఫ్రికా (Africa) దేశాల్లో మాత్రం ఏమైనా అనుకోని ఘటన జరిగితే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో బంగారు గనుల వద్ద నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది (Shcoking Videos).
ఈ వీడియో మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోకు (Congo) చెందినది. కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్‌లో ఆర్టిసానల్ అనే గోల్డ్ మైన్ ఉంది. అందులో కొందరు కార్మికులు పని చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆ గని ఇటీవల కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా కార్మికులు వెంటనే బయటకు రాలేనంత వేగంగా గని కూలిపోయింది. అందులో 9మంది చిక్కుకుపోయారు. అలాంటి ప్రమాదం జరిగినపుడు కార్మికులను రక్షించేందుకు అవసరమైన యంత్రాలు కూడా వారి వద్ద లేవు. పై నుంచి మట్టి, రాళ్లు పడిపోవడంతో గని మూసుకుపోయింది.
Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!
అప్పటికే బయటకు వచ్చిన వ్యక్తులు తమ చేతులతోనే మట్టిని తవ్వి అందులో చిక్కుకుపోయిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. పై నుంచి గని కూలిపోతూనే ఉంది. అలా ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం 9 మందిని గని నుంచి కాపాడారు. ఈ వీడియో బయటకు రావడంతో ప్రభుత్వంపై, ఆ గని నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల ప్రాణాలకు కనీస విలువ కూడా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.