Shocking Video: ఇంటి పైకప్పు పై నుండి వేలాడుతున్న పాము తోక.. కదిలించగానే ఏం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2023-02-15T12:19:41+05:30 IST
పైకప్పు పగలగొట్టగానే కనిపించిన దృశ్యం చూసి షాక్ కు లోనయ్యారు, భయంతో కేకలు వేశారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియో..
రాత్రి నిద్రపోతుంటే ఇంటి పైకప్పు నుండి ఒకటే శబ్దాలు. మొదట ఆ కుటుంబ సభ్యులు లైట్ తీసుకున్నారు, కానీ రానురాను ఆ శబ్దాలు ఎక్కువ అవుతుండటంతో భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కబురు చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆ పైకప్పు పగలగొట్టగా పాము తోక కనిపించింది. దాన్ని లాగితే అది ఎంతకూ రాలేదు. చివరికి మరికొంత గట్టిగా లాగినప్పుడు కనిపించిన దృశ్యం చూసి షాక్ కు లోనయ్యారు, భయంతో కేకలు వేశారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
మలేషియాలో నివసిస్తున్న ఓ కుటుంబం రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒకటే శబ్దాలు రావడం మొదలయ్యింది. ఎందుకింత శబ్దాలు వస్తున్నాయని వారు చిరాకు పడ్డారు. అయితే నెమ్మదిగా ఆ శబ్దాలు మరింత ఎక్కువ కావడంతో కంగారు పడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు కబురు పెట్టారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి పైకప్పు కొద్దిగా పగలగొట్టగా పాము తోక కిందకు వేలాడింది. దీంతో వాళ్ళు రెస్క్యూ సిబ్బిందికి కబురు చేశారు. రెస్క్యూ వర్కర్స్ అక్కడికి చేరుకుని ఆ పామును కిందకు లాగాలని ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో రెస్క్యూ సిబ్బంది పైకప్పును మరికొంచెం పగలగొట్టగా ఒకటికి బదులు ఏకంగా మూడు పాములు కిందకు వేలాడాయి. అవేవో చిన్నాచితకా పాములు కాదు. చాలా భారీ సైజులో ఉన్నాయి. మూడింటిలో రెండు మళ్ళీ పైకప్పులోకి వెళ్ళిపోగా ఒకపాము మాత్రం కిందకు అలాగే వేలాడుతూ ఉంది. దాంతో రెస్క్యూ సిబ్బంది ఆ పాము తోక పట్టుకుని కిందకు లాగారు. సుమారు ముగ్గురు వ్యక్తులు లాగగా ఆ పాము కింద పడింది. అది చాలా పెద్దగా ఉంది. ఆ పామును అతి కష్టం మీద లాక్కుంటూ బయటకు తీసుకెళ్ళారు. మిగిలిన రెండుపాములను ఎలా పట్టారో తెలియదు కానీ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
వీడియోలో పాములను చూసిన నెటిజన్స్ కూడా ఓ రేంజ్ లో దడుచుకున్నారు. 'ఇలాంటి పాముల మధ్య బ్రతకడం అంటే నరకం, మార్స్ కు పారిపోవాలిప్పుడు' అని ఒకరు, 'వీటిని చూస్తే పీడకలలు రావడం ఖాయం' అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొక ట్విట్టర్ యూజర్ అయితే 'ఆ ఇంటికి నిప్పు పెట్టండ్రా సామి..' అని తన భయాన్ని వెలిబుచ్చారు. ఏది ఏమైనా ఆ పాములు పైకప్పులోకి ఎలా వెళ్ళాయనేది మాత్రం మిస్టరీగా ఉండిపోయింది.