Bizarre: ప్రేమను ఒప్పుకోలేదని అమ్మాయిపై కోర్టులో కేసు.. నష్ట పరిహారంగా రూ.24కోట్లు డిమాండ్!

ABN , First Publish Date - 2023-02-03T10:43:24+05:30 IST

ప్రేమించిన అమ్మాయి తమ ప్రేమను (Love) ఒప్పుకోకపోతే దాడి చేసేవారి గురించి ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోయే వ్యక్తి కూసింత వెరైటీ అనే చెప్పాలి.

Bizarre: ప్రేమను ఒప్పుకోలేదని అమ్మాయిపై కోర్టులో కేసు.. నష్ట పరిహారంగా రూ.24కోట్లు డిమాండ్!

సింగపూర్ సిటీ: ప్రేమించిన అమ్మాయి తమ ప్రేమను (Love) ఒప్పుకోకపోతే దాడి చేసేవారి గురించి ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోయే వ్యక్తి కూసింత వెరైటీ అనే చెప్పాలి. తాను ప్రేమించిన అమ్మాయి (Girlfriend) తన ప్రేమను అంగీకరించకపోవడంతో మనోడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం. తాను ప్రేమించిన అమ్మాయి తన లవ్‌ను ఒప్పుకోకపోవడంతో ఆమెపై కోర్టుకెక్కాడు. నష్ట పరిహారంగా ఏకంగా రూ.24కోట్లు చెల్లించాలంటూ కోర్టులో కేసు వేశాడు. అవును మీరు విన్నది నిజమే. సింగపూర్‌కు (Singapore) చెందిన కౌషిగన్ అనే వ్యక్తి ఇలా తాను ప్రేమించిన అమ్మాయిపై కోర్టుకెక్కి వార్తల్లో నిలిచాడు.

ఇది కూడా చదవండి: ఈ శునకం వందల కోట్లకు యజమాని.. పాప్ స్టార్ మడోన్నా ఇంట్లో నివాసం.. మరెన్నో విలాసాలు దీని సొంతం!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌషిగన్‌కు (Kawshigan) 2016లో నోరా టాన్ (Nora Tan) అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెతో మనోడు పీకలోతు ప్రేమలో పడిపోయాడు. కానీ, నోరాకు మాత్రం కౌషిగన్‌పై అలాంటి అభిప్రాయం లేదు. అతడిని ఆమె కేవలం ఓ మంచి స్నేహితుడిగానే చూసింది. ఈ క్రమంలో కౌషిగన్ మాటల్లో, ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన నోరా మన ఇద్దరి రిలేషన్ కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని, వేరేది ఏమీ ఊహించకోవద్దని ముందే తేల్చి చెప్పేసింది. అయినా, మనోడు మనసు చంపుకోలేక ఒకరోజు తన ప్రేమను నోరాకు చెప్పడంతో ఆమె నిరాకరించింది. అలాగే అప్పటి నుంచి అతడిని దూరం పెట్టింది. దీంతో కౌషిగన్.. 'ఆమె వల్ల పరువు నష్టం జరిగింది. మనసుకు గాయంతో పాటు జీవితంలో నిరాశ మిగిలింది' అని కోర్టుమెట్లు ఎక్కాడు. నష్ట పరిహారంగా ఆమె తనకు రూ.24కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో నెట్టింట చక్కర్లు కోడుతోంది. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

Updated Date - 2023-02-03T11:11:20+05:30 IST