Shocking: స్కూలుపై నుంచి దూకేసిన 6వ తరగతి బాలిక.. ఆమె స్కూల్ బ్యాగులో వెతికితే..!

ABN , First Publish Date - 2023-08-26T20:11:17+05:30 IST

ఆ బాలిక ఆరో తరగతి చదువుతోంది.. చక్కగా చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసు.. ఆ వయసులో ఆ బాలిక చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోయింది.. ఒత్తిడిని భరించలేకపోయింది.. స్కూల్ భవనంపై నుంచి కిందకు దూకింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది.

Shocking: స్కూలుపై నుంచి దూకేసిన 6వ తరగతి బాలిక.. ఆమె స్కూల్ బ్యాగులో వెతికితే..!

ఆ బాలిక ఆరో తరగతి చదువుతోంది (Sixth class girl).. చక్కగా చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసు.. ఆ వయసులో ఆ బాలిక చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోయింది.. ఒత్తిడిని భరించలేకపోయింది.. స్కూల్ భవనంపై నుంచి కిందకు దూకింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ (Ranchi)లో జరిగింది. రాంచీలోని సేక్రేడ్‌ హార్ట్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనే ఉద్దేశంతో స్కూలు భవనం పైకప్పుపై నుంచి దూకేసింది. పాఠశాలలోని మూడో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు (Crime News).

ఆ హాస్పిటల్‌లో ఆ బాలిక చావు బతుకుల మధ్య పోరాడుతోంది. శుక్రవారం పాఠశాల టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు, ఆ విద్యార్థిని 3 సార్లు భవనం పైకి వెళ్లి తిరిగి కిందకు వచ్చింది. చివరికి ఉదయం 11 గంటల సమయంలో టెర్రస్ పైకి చేరుకుని అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను రాంచీలోని పరాస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ బాలిక స్కూల్ బ్యాగ్ వెతకగా అందులో ఓ నోట్ కనిపించింది. 2023వ సంవత్సరం తనకేం బాగోలేదని ఆ నోట్‌లో రాసింది.

NRI Mother: సరిగా చూసుకోవడం లేదంటూ ఇద్దరు పిల్లలను లాగేసుకున్న ఆస్ట్రేలియా అధికారులు.. ఆ ఎన్నారై తల్లి భరించలేక..!

``నేను కుటుంబ సమస్యలు, చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నాకు అంతా చెడే జరిగింద``ని ఆ బాలిక తన నోట్‌బుక్‌లో రాసింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరిన బాలికను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలిక శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ప్రస్తుతం ఆ బాలికను వెంటిలేటర్‌పై ఉంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-08-26T20:11:17+05:30 IST