నిద్రలో 5 దశలు ఉంటాయని తెలుసా? ఒక్కో దశలో ఏమి జరుగుతుందో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-17T13:58:26+05:30 IST

మనం రోజూ నిద్రపోతుంటాం. నిద్ర లేకుండా మనం జీవించలేం. అయితే నిద్రలో ఉండే దశల గురించి చాలామందికి తెలియదు.

నిద్రలో 5 దశలు ఉంటాయని తెలుసా? ఒక్కో దశలో ఏమి జరుగుతుందో తెలిస్తే...

మనం రోజూ నిద్రపోతుంటాం. నిద్ర లేకుండా మనం జీవించలేం. అయితే నిద్రలో ఉండే దశల గురించి చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రకు 5 దశలు

నిద్ర మొత్తం 5 దశల్లో జరుగుతుంది. మొదటి, రెండవ దశలు తేలికపాటి నిద్ర, మూడవ, నాల్గవ దశలు గాఢ నిద్ర(deep sleep), ఐదవ దశను REM స్లీప్ అంటారు.

మొదటి దశ

ఈ దశను తేలికపాటి నిద్ర అంటారు. దీనిని సాధారణంగా రా నిద్ర అని పిలుస్తారు. ఈ స్థితిలో కొంచెం శబ్దం(noise) వచ్చినా వెంటనే కళ్లు తెరుచుకుంటాయి. ఈ దశలో కంటి పాపలు నెమ్మదిగా కదులుతుంటాయి. కండరాల కార్యకలాపాలు కూడా మందగించడం ప్రారంభిస్తాయి.

రెండవ దశ

మొదటి దశ చక్రం పూర్తయిన తర్వాత నిద్ర రెండవ దశలోకి ప్రవేశిస్తుంది. ఇందులో మెదడు గాఢ నిద్రలోకి వెళ్లేందుకు సిద్ధపడుతుంది. ఈ సమయంలో కంటిపాపల కదలిక(Eye movement) మందగించడం ప్రారంభమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. హృదయ స్పందన కూడా మునుపటి కంటే నెమ్మదిస్తుంది.

మూడవ దశ

రెండో దశ తర్వాత ఇప్పుడు మూడో దశలోకి అడుగుపెట్టాల్సిన తరుణం. ఈ దశలో మెదడు గాఢ నిద్రకు చేరుకుంది. నెమ్మదిగా డెల్టా తరంగాలు(Delta waves) మెదడు నుండి బయటకు రావడం మొదలవుతుంది. ఇది కొన్ని ఇతర తరంగాలతో కనెక్ట్ కావడం ద్వారా మనస్సును మరింత రిలాక్స్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుంది.

నాల్గవ దశ

నాల్గవ దశలో మనస్సు గాఢనిద్రకు చేరుకుంది. ఈ సమయంలో మెదడు నుండి వెలువడే తరంగాలు మెదడు, ఇతర శరీర భాగాలను సడలిస్తాయి. హృదయ స్పందన చాలా తక్కువగా మారుతుంది. శ్వాస వేగం(Breathing speed) కూడా తగ్గుతుంది. ఈ దశ దాటాక ఐదవ దశకు వెళతారు.

చివరిది ఐదవ దశ

ఇది నిద్రలో చివరి దశ. ఇది సరైన మార్గంలో జరిగితే దానిని ఆరోగ్యకరమైన నిద్ర అంటారు. ఈ దశను REM స్లీప్ అంటారు. ఈ దశలో కళ్ళు పూర్తిగా మూసుకుంటాయి. నిద్రిస్తున్న వ్యక్తి కలలు(dreams) కనడం ప్రారంభిస్తాడు. స్వప్నం కారణంగా కంటి పాపలు వేగంగా కదులుతారు. ఇది దాదాపు 90 నిమిషాల పాటు ఉంటుంది. ఈ దశ పిల్లలు, యువతలో అధికంగా కనిపిస్తుంది.

Updated Date - 2023-04-17T13:59:41+05:30 IST