Starbucks: సడన్‌గా ఉద్యోగంలోంచి తొలగించారని కోపం.. స్టార్‌బక్స్ కంపెనీకి కలలో కూడా ఊహించని షాకిచ్చిన మహిళ..!
ABN , First Publish Date - 2023-10-16T18:32:22+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కాఫీ హౌస్ ``స్టార్‌బక్స్``. ఖరీదు బాగా ఎక్కువైనా స్టార్‌బక్స్ బ్రాండ్ కాఫీకి భారీగా అభిమానులున్నారు. అక్కడి దొరికే కాఫీ రుచి అమోఘంగా ఉంటుందని, అలాంటి రుచి మరెక్కడా లభించదని కాఫీ ప్రియులు చెబుతుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కాఫీ హౌస్ ``స్టార్‌బక్స్`` (Starbucks). ఖరీదు బాగా ఎక్కువైనా స్టార్‌బక్స్ బ్రాండ్ కాఫీకి (Coffee) భారీగా అభిమానులున్నారు. అక్కడి దొరికే కాఫీ రుచి అమోఘంగా ఉంటుందని, అలాంటి రుచి మరెక్కడా లభించదని కాఫీ ప్రియులు చెబుతుంటారు. కాఫీతో పాటు ఆ కెఫేలో దొరికే ఇతర పానీయాల తయారీ విధానాలను స్టార్‌బక్స్ జాగ్రత్తగా రక్షించుకుంటుంది. ఆ రెసీపీలను బయటపెట్టకూడదని ఉద్యోగులందరికీ (Starbucks employee) కఠిన నిబంధనలు విధిస్తుంది. అయితే తాజాగా ఓ ఉద్యోగి ఆ రెసిపీలను (Recipes of Starbucks Coffee) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తనను ఉద్యోగంలో నుంచి తొలగించారనే కోపంతో ఆ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏ పానీయాన్ని ఎలా తయారు చేయాలో సూచిస్తూ రకరకాల రెసిపీలను నెట్టింట షేర్ చేశాడు. తయారీ విధానాలను సూచించే డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి కాస్తా బాగా వైరల్ అయ్యాయి. వాటిని చూసి కాఫీ ప్రియులు సంబరపడిపోతున్నారు. 9.7 లక్షల మందికి పైగా ఆ ట్వీట్ (Viral Tweet)ను వీక్షించారు. ఎంతో మంది ఈ ట్వీట్‌పై స్పందించారు.
Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. నేల మీదే కాదు నీటిలో కూడా వెళ్లే బైక్.. ఎలా ప్లాన్ చేశాడో చూడండి..
ఈ రెసిపీలతో స్టార్‌బక్స్‌ను పోలిన మరో కెఫే తెరవొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ``ఈ లీకైన రెసిపీల ఆధారంగా ఇంట్లోనే స్టార్‌బక్స్ స్థాయి కాఫీలు తయారు చేసుకోవచ్చు``, ``ఇకపై స్టార్‌బక్స్‌లో నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. కొత్త ఉద్యోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి``, ``ఇది అనైతికం`` అంటూ కామెంట్లు చేశారు. అయితే ఇంతకు ముందు కూడా పలువురు ఉద్యోగులు ``స్టార్‌బక్స్`` పానియాల రెసిపీలను బయటకు వెల్లడించారు.