Viral: పట్టెడన్నం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నావ్! ఈ కష్టం ఎవరికీ రాకూడదు బ్రో.. షాకింగ్ వీడియో!
ABN , First Publish Date - 2023-10-13T19:18:46+05:30 IST
లైఫ్ చాలా విచిత్రమైంది. కొందరు నెలల వ్యవధిలో కోట్లకు పడగలెత్తిత్తే మరికొందరు గుక్కెడు మెతుకులు కోసం ప్రాణాలకే తెగించాల్సి వస్తోంది. అలాంటి ఓ వ్యక్తి వీడియో చూసి నెటిజన్లు కంటతండి పెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్ చాలా విచిత్రమైంది. కొందరు నెలల వ్యవధిలో కోట్లకు పడగలెత్తిత్తే మరికొందరు గుక్కెడు మెతుకులు కోసం ప్రాణాలకే తెగించాల్సి వస్తోంది. అలాంటి ఓ వ్యక్తి వీడియో(Viral Video) చూసి నెటిజన్లు కంటతండి పెడుతున్నారు. నీ కష్టం ఎవరికీ రాకూడదు బ్రదర్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టెడన్నం కోసం వీడియోలోని వ్యక్తి ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సదరు వ్యక్తి రైళ్లల్లో వాటర్ బాటిల్స్ అమ్ముకుని పొట్టపోసుకుంటాడు. ఈ క్రమంలో జీవితం దినదినగండంగా మారడం చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి నెత్తిమీద ఓ ప్లాస్టిక్ తట్టపెట్టుకుని రైలు బయలుదేరుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించాడు. మెల్లగా పరిగెట్టడం మొదలెట్టిన అతడు నెత్తిమీదున్న తట్టను ఓ చేత్తో బ్యాలెన్స్ చేస్తూ మరో చేత్తో రైలు తలుపు పక్కనున్న హ్యాండిల్ పట్టుకుని ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మెట్టుపై నున్న అతడి కాలు బెసగడంతో కిందపడిపోయాడు(street Hawker falls while trying to board a moving train). ఈ క్రమంలో తట్టలోని బాటిల్స్ అన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే, అదృష్టవశాత్తూ అతడు రైలుకు కాస్తదూరంలో పడటంతో పెను ప్రమాదమే తప్పింది. కాస్త అటూఇటూ అయ్యి ఉన్నా అతడు రైలు కింద పడి ప్రాణాలు లేదా చేతులూ కాళ్లూ పోగొట్టుకుని ఉండే వాడు. అయితే, వీడియోలో అతడి లాగే మరికొందరు కూడా అత్యంత ప్రమాదకర రీతిలో రన్నింగ్ ట్రైన్ ఎక్కారు.
Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..
Supreme Court: నాకు డైవర్సీగా చనిపోవాలని లేదు.. 82 ఏళ్ల వృద్ధురాలి అభ్యర్థన.. కోర్టు తీర్పు ఏంటంటే..
కాగా, ఈ వీడియో నెటిజన్లను అమితంగా కలిచివేస్తోంది. పొట్టకూడి కోసం అతడు ప్రాణాలకు తెగించడం చూసి జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని అనేక మంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, బంధుప్రీతి పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమని మరికొందరు వ్యాఖ్యానించారు. అధిక జనాభాతోనూ సమస్యలు పెరిగిపోతున్నాయని కొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్ల నడుమ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.