Hostel Boys: ``గే`` అంటూ హాస్టల్‌లో సీనియర్స్ కామెంట్స్.. కాదని ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ కుర్రాడు ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2023-08-14T18:47:47+05:30 IST

ఆ యువకుడు యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటూ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నాడు. కొత్త స్టూడెంట్ అయిన అతడిని సీనియర్లు ర్యాగింగ్ చేసేవారు. అయితే ఒక సీనియర్ విద్యార్థి శృతి మించి మరీ ఏడిపించాడు. తన బ్యాచ్‌తో కలిసి తరచుగా వేధించేవాడు. ``గే`` అంటూ ఏడిపించేవాడు.

Hostel Boys: ``గే`` అంటూ హాస్టల్‌లో సీనియర్స్ కామెంట్స్.. కాదని ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ కుర్రాడు ఏం చేశాడంటే..!

ఆ యువకుడు యూనివర్సిటీ హాస్టల్‌ (Hostel)లో ఉంటూ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నాడు. కొత్త స్టూడెంట్ అయిన అతడిని సీనియర్లు (Senior Students) ర్యాగింగ్ చేసేవారు. అయితే ఒక సీనియర్ విద్యార్థి శృతి మించి మరీ ఏడిపించాడు. తన బ్యాచ్‌తో కలిసి తరచుగా వేధించేవాడు. ``గే`` (Gay) అంటూ ఏడిపించేవాడు. అతడి మాటలు తట్టుకోలేకపోయిన ఆ జూనియర్ విద్యార్థి (Junior Student) హాస్టల్ బిల్డింగ్ నుంచి దూకి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సీనియర్‌ను అరెస్ట్ చేశారు (Crime News).

కోల్‌కతా (Kolkata)లోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో స్వలింగ సంపర్కుడని పదే పదే ఏడిపించడంతో స్వప్నదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీఏ హానర్స్ చదువుతున్న స్వప్నదీప్ ఆగస్టు 9వ తేదీ రాత్రి హాస్టల్ బిల్డింగ్ రెండో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. ఆ సమయంలో స్వప్నదీప్ నగ్నంగా ఉన్నాడు. సీనియర్ విద్యార్థి సౌరవ్ చౌదరి వేధింపుల వల్లే స్వప్నదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్వప్నదీప్‌ను సౌరవ్ తరచుగా ఏడిపించేవాడు. ``గే`` అంటూ అందరి ముందూ గేలి చేసేవాడు.

Viral: భారత్ కుర్రాడు.. రష్యన్ అమ్మాయి.. కాలేజీలో మొదలైన ప్రేమాయణం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..!

ఆగస్టు 9వ తేదీ రాత్రి కూడా హాస్టల్‌లో స్వప్నదీప్‌ను తన బ్యాచ్‌తో కలిసి ర్యాగింగ్ (Raging) చేశాడు. బలవంతంగా స్వప్నదీప్ బట్టలు విప్పించి ``గే`` అంటూ తోటి విద్యార్థులతో కేకలు వేయించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన స్వప్నదీప్ ``నేను గే కాదు`` అని అరుస్తూ హాస్టల్ రెండో అంతస్థు నుంచి దూకేశాడు. తీవ్రగాయాల పాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందుకుంటూ ఆదివారం తెల్లవారుఝామూన మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సౌరవ్ చౌదరిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-08-14T18:47:47+05:30 IST