Success Story: 3వ తరగతి వరకే చదివిన ఇతడు కోట్లు సంపాదిస్తున్నాడంటే నమ్మగలరా..? బ్యాంక్ ముందు సెక్యూరిటీ గార్డు జాబ్‌కు రిజైన్ చేసి..
ABN , First Publish Date - 2023-02-24T16:46:41+05:30 IST
ఇవన్నీ కాదు.. మనం ఉండాల్సింది ఇక్కడ కాదు అనిపించిందేమో
అతను చదివింది 3వ తరగతే.. సంపాదన కోసం ఓ ఇంట్లో వంట మనిషిగా చేశాడు, ఆ తరువాత బ్యాంక్ ముందు సెక్యూరిటీ గార్డుగా చేశాడు. కానీ ఇవన్నీ కాదు.. మనం ఉండాల్సింది ఇక్కడ కాదు అనిపించిందేమో అక్కడ ఉద్యోగం వదిలి వచ్చిన దారినే ఇంటికి వెళ్ళాడు. తండ్రి చేసే వ్యవసాయ భూమిలోనే వినూత్నంగా తన ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. చదువుకు సంపాదనకు సంబంధం లేదని ఎందరో నిరూపించారు. ఇప్పుడు ఇతనూ నిరూపిస్తున్నాడు. ఇతని గురించి తెలుసుకుంటే..
రాజస్తాన్ రాష్ట్రం బార్మర్ జిల్లాలో నింబరం అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఈ జిల్లా మొత్తం ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇసుక నేలలే కనబడతాయి. ఈ నేలల్లో నింబరం తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఎడారి పంటలు అయిన జీలకర్ర, ఈసబ్ గోల్ పండించేవాడు. అయితే నింబరం తండ్రి దగ్గర నుండి ముంబై వెళ్ళిపోయి అక్కడ ఒక సేట్ ఇంట్లో వంటవాడిగా చేరాడు. మూడు సంవత్సరాలు అక్కడ పనిచేశాక తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొన్నిరోజుల తరువాత ఢిల్లీలోని ఒక బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ జీతం తక్కువగా ఇస్తుండటంతో అక్కడి నుండి కూడా వచ్చేశాడు. తండ్రి జీలకర్ర పంటకు నీటి సౌకర్యం కోసం పైప్ లేన్ వేయించడానికి గుజరాత్ లో లఖ్నీ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ దానిమ్మ తోటలు పచ్చగా కళకళలాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. అందునా డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో సాగు జరుగుతుండటంతో దానిమీద అతనికి ఆసక్తి కలిగింది. అతను తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి దానిమ్మ పంట సాగు చేద్దామని అడిగాడు. తండ్రి ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను అందరినీ లఖ్నీ గ్రామానికి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడ దానిమ్మతోటను చూసి సంతృప్తి చెందాక నింబరం కూడా దానిమ్మ సాగు మొదలుపెట్టాడు.
Read also: Time traveller: ఈ ఏడాది ఈ అయిదు సంఘటనలు జరిగితీరుతాయట.. డేట్స్ తో సహా షాక్ ఇస్తున్న టైం ట్రావెలర్...
తమకున్న రెండు హెక్టార్ల భూమిలో 2010-11 సంవత్సరంలో 25వేలు వెచ్చించి 1000దానిమ్మ మొక్కలు కొనుగోలు చేసి వాటిని నాటాడు. మొక్కల పెంపకం కోసం 35వేల రూపాయలతో డ్రిప్ పరికరాలు తెప్పించాడు. రెండేళ్ళ తరువాత మొదటి దిగుబడి వచ్చింది. అప్పుడు 3లక్షల ఆదాయం వచ్చింది. అప్పటినుండి ఇతను వెనుదిరిగి చూడలేదు. ప్రతి ఏడాది దిగుబడితో పాటు అతని ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా 2022-23 సంవత్సరానికి గానూ 135లక్షలదానిమ్మ దిగుబడి వచ్చింది. దీనికి 75లక్షల ఆదాయం లభించింది. ఇప్పుడు బర్మార్ జిల్లా దానిమ్మ పంటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పదేళ్ళ కిందట ఇసుకనేలలు అన్నీ ఇప్పుడు పచ్చని దానిమ్మ సాగుతో రూపురేఖలు మార్చుకున్నాయి. 1 హెక్టారులో మొదలుపెట్టిన ఇతని దానిమ్మ సాగు క్రమంగా 10హెక్టార్లకు విస్తరించింది. మొత్తం 10వేల మొక్కల సాగు ఇతని చేతిలో ఉంది. తను దానిమ్మ సాగులో రాణిస్తున్నందుకు కృతజ్ఞతగా తన ప్రాంత రైతులకు దానిమ్మ సాగుపై అవగాహన కల్పిస్తున్నాడు, ఇప్పటిదాకా ఎంతో మంది రైతులకు దానిమ్మ మొక్కలు ఉచితంగా పంపిణీ చేశాడు.