Success Story: వయసు 20 ఏళ్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లు.. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..!

ABN , First Publish Date - 2023-09-15T14:25:31+05:30 IST

ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు.. సాధారణంగా ఆ వయసు కుర్రాళ్లు ఏ కోర్సులో చేరాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి అనే కన్ఫ్యూజన్‌లో ఉంటారు.. అయితే ఆ కుర్రాడు అందరి లాంటి వాడు కాదు.. ఆ వయసులో ఏకంగా ఓ కంపెనీనీ ప్రారంభించాడు. రెండేళ్లు తిరిగే సరికల్లా ఆ కంపెనీ విలువ ఏకంగా రూ.7300 కోట్లకు చేరుకుంది.

Success Story: వయసు 20 ఏళ్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఏకంగా రూ.1000 కోట్లు.. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరంటే..!

ఆ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు.. సాధారణంగా ఆ వయసు కుర్రాళ్లు ఏ కోర్సులో చేరాలి, ఏ కాలేజీలో జాయిన్ కావాలి అనే కన్ఫ్యూజన్‌లో ఉంటారు.. అయితే ఆ కుర్రాడు అందరి లాంటి వాడు కాదు.. ఆ వయసులో ఏకంగా ఓ కంపెనీనీ ప్రారంభించాడు (Success Story).. రెండేళ్లు తిరిగే సరికల్లా ఆ కంపెనీ విలువ ఏకంగా రూ.7300 కోట్లకు చేరుకుంది.. దీంతో దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ ఫౌండర్‌గా ఆ కుర్రాడు నిలిచాడు.. 21 ఏళ్ల లోపు వయసులో తిరుగులేని 21 మంది భారతీయులలో ఒకడిగా నిలిచాడు.. ఆ కుర్రాడి పేరు కైవల్య వోహ్రా (Kaivalya Vohra). ఆ కుర్రాడు స్థాపించిన కంపెనీ పేరు ``జెప్టో`` (Zepto).

2001లో జన్మించిన కైవల్య చదువు అంతా ముంబై (Mumbai)లో సాగింది. అక్కడే కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లాడు. అయితే చదువు పూర్తి కాకుండానే భారత్‌కు తిరిగి వచ్చేశాడు. కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే కైవల్యకు ``జెప్టో`` ఆలోచన వచ్చింది. ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే, అతనికి సరుకు చేరడానికి కనీసం రెండు రోజులు పట్టేది. అలా కాకుండా కొన్ని గంటల్లోనే వస్తువులను డెలివరీ చేసే కంపెనీని ప్రారంభించాలనే ఆలోచన కైవల్యకు వచ్చింది. 2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి సమయంలో తన స్నేహితుడు అదిత్ పాలీచాతో కలిసి ``జెప్టో``ను ప్రారంభించాడు. 1000 మంది ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లతో ముంబైలో కంపెనీని ప్రారంభించాడు.

కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ డెలివరీకి (Online Delivery) డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇది ``జెప్టో``కు ప్రయోజనం చేకూర్చింది. ఒక్క నెలలోనే ``జెప్టో`` సంస్థ 200 మిలియన్ డాలర్లు సంపాదించింది. వాల్యుయేషన్ పరంగా, కంపెనీ ఒక సంవత్సరంలోనే 900 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే దాదాపు రూ.7300 కోట్లు. కైవల్య నికర సంపాదన రూ.1000 కోట్లకు చేరింది. మెట్రో నగరాల్లో ``జెప్టో`` కంపెనీ.. ``బ్లింకిట్``, ``బిగ్ బజార్‌``లకు మంచి పోటీ ఇచ్చింది. ఇటీవల సిరీస్-E ఫండింగ్‌ ద్వారా ``జెప్టో`` 200 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో జెప్టో వాల్యుయేషన్ 1.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. ``జెప్టో``ను రాబోయే 2-3 సంవత్సరాలలో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలనుకుంటున్నారు.

Updated Date - 2023-09-15T14:25:31+05:30 IST