Success Story: చేతిలో డబ్బుల్లేక.. జాబ్ కోసం కంపెనీల చుట్టూ తిరిగిన ఈ కుర్రాడికే.. ఇప్పుడు సొంతంగా ఓ కంపెనీ.. నెల నెలా..!
ABN , First Publish Date - 2023-09-29T16:02:05+05:30 IST
విజయం అనేది ఎవరికీ అంత సులభంగా రాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని గుండె ధైర్యంతో పోరాడితేనే గెలుపు వరిస్తుంది. ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే కష్టాలన్నీ పక్కకు తప్పుకుంటాయి. కష్టపడేవారు ఆలస్యంగానైనా విజయం సాధిస్తారనేది నిజం.
విజయం (Success) అనేది ఎవరికీ అంత సులభంగా రాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని గుండె ధైర్యంతో పోరాడితేనే గెలుపు వరిస్తుంది. ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే కష్టాలన్నీ పక్కకు తప్పుకుంటాయి. కష్టపడేవారు ఆలస్యంగానైనా విజయం సాధిస్తారనేది నిజం. అలాంటి ఎన్నో విజయ గాథలు ఇతరులకు స్ఫూర్తిగా (Inspiration) నిలుస్తుంటాయి. బీహార్ (Bihar)లోని సీతామర్హి జిల్లాకు చెందిన కృష్ణ మోహన్ కుమార్‌ది కూడా అలాంటి కథే (Success Story).
సీతామర్షి జిల్లాకు చెందిన కృష్ణ మోహన్ పీజీ చదువుకుని ఉద్యోగాల వేటలో విసిగిపోయాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్యోగం వచ్చే అవకాశం కనిపించకపోవడంతో స్వయంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాడు. యూట్యూబ్‌లో ఒకరోజు అగరబత్తీల తయారీ వీడియోను చూశాడు. తనకు అదే సరైందని భావించి లోన్ తీసుకుని సొంత ఫ్యాక్టరీ ప్రారంభించాడు. ``ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా వాడే వస్తువు అగరబత్తీ (Incense sticks). పుట్టుక నుంచి మరణం వరకు దీని అవసరం ఉంటుంది. ఏ సీజన్‌లోనూ దీని వినియోగం తగ్గదు. మాంద్యం ఏర్పడినా ఈ వ్యాపారంపై ప్రభావం పడద``ని నిర్ణయించుకుని వ్యాపారం ప్రారంభించానని కృష్ణ మోహన్ తెలిపాడు.
Shocking: అమ్మకానికి అమ్మాయిలు.. కన్నతల్లిదండ్రులతోనే బేరాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!
వ్యాపారం కోసం ఎన్నో ప్రయత్నాల తర్వాత జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి రూ.10 లక్షల రుణం పొందాడు. ఆ తర్వాత వ్యాపారం ప్రారంభించాడు. తన గ్రామానికే చెందిన 11 మందికి ఉద్యోగాలు కల్పించాడు. ప్రస్తుతం ముజఫర్‌పూర్, శివహర్, సీతామర్హి, దర్భంగా, మధుబని జిల్లాల్లో కృష్ణ మోహన్ తన అగరబత్తీలను సరఫరా చేస్తున్నాడు. ప్రతి నెలా సుమారు ఐదు లక్షల అగరబత్తీలు విక్రయిస్తుంటాడు. అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.50 వేల వరకు సంపాదిస్తుంటాడు.