Sushmita Sen: ‘ఆ సాంగ్ ఒప్పుకున్నందుకు.. ఆ ఇద్దరూ నన్ను వదిలిపోయారు’.. సంచలన విషయాలు బయటపెట్టిన నటి
ABN , First Publish Date - 2023-03-01T12:00:01+05:30 IST
మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం మిస్ యూనివర్స్ కిరీటం గెలిచి.. ఆపై బాలీవుడ్ (Bollywood)లో అడుగుపెట్టిన నటి సుస్మితా సేన్ (Sushmita Sen).
మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం మిస్ యూనివర్స్ కిరీటం గెలిచి.. ఆపై బాలీవుడ్ (Bollywood)లో అడుగుపెట్టిన నటి సుస్మితా సేన్ (Sushmita Sen). కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే.. పలు కారణాల వల్ల చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరమైంది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘ఆర్య’ (Aarya) అనే వెబ్‌సిరీస్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు సీజన్లు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా.. సుస్మితాకి సైతం మంచి క్రేజ్‌ని సంపాదించి పెట్టింది.
అయితే.. తన బోల్డ్ కామెంట్స్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో మెయిన్ హీరోయిన్స్ ఐటమ్ నంబర్స్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆ తరుణంలో సుస్మిత అలాంటి సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంది. దాని వల్ల ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి కూడా. ఈ విషయం గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్
సుస్మిత మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో హీరోయిన్స్ ఐటమ్ నంబర్స్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అది వారి కీర్తి ప్రతిష్టలకి సమస్య అవుతుంది. కానీ నేను వాటిని ఒప్పుకున్నాను. దానికి నేను చాలా గర్వపడుతున్నా. ఇప్పుడు చాలామంది అలాంటి సాంగ్స్ చేస్తున్నారు.
అయితే.. నా నిర్ణయం నా దగ్గర ఉండే ఇద్దరు మేనేజర్లని నచ్చలేదు. వారేమో నన్ను మూవీలో హీరోయిన్‌గా అవకాశాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తరుణంలో నేను ఐటమ్ సాంగ్ (Item Song) ఒప్పుకోవడం వారికి నచ్చలేదు. నాకు పిచ్చి అనుకున్నారు. అందుకే వారు నా దగ్గర పనిని మానేశారు. కానీ.. సినిమా చెత్తగా ఉన్నప్పటికీ సంగీతానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉందని నా ఆలోచన. అందుకే ఐటమ్ సాంగ్స్‌ని ఒప్పుకునేదాన్ని’ అని చెప్పుకొచ్చింది.