Tarakaratna: టీడీపీ ఎవరిదన్న ప్రశ్నకు తారకరత్న సూటి సమాధానం!
ABN , First Publish Date - 2023-02-19T16:05:15+05:30 IST
‘‘తెలుగు దేశం (TDP)పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలోనే ఉండాలని కొందరు అంటుంటే.. ‘నందమూరి ఫ్యామిలీని *Nandamuri Family) దూరం పెట్టండి’ అని నారా కుటుంబం అంటోందని వినిపిస్తోంది.. ఇందులో నిజమేది’’ నందమూరి తారకరత్నకు ఓ యాంకర్ నుంచి ఎదురైన ప్రశ్న ఇది.
‘‘తెలుగు దేశం (TDP)పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలోనే ఉండాలని కొందరు అంటుంటే.. ‘నందమూరి ఫ్యామిలీని *Nandamuri Family) దూరం పెట్టండి’ అని నారా కుటుంబం అంటోందని వినిపిస్తోంది.. ఇందులో నిజమేది’’ నందమూరి తారకరత్నకు ఓ యాంకర్ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. దీనికి తారకరత్న (Nandamuri tarakaratna)ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
టీడీపీ నారా కుటుంబానిదా?
నందమూరి వారిదా? (Tarakaratna about tdp)
అంటే .. ఇది తెలుగువాడి పార్టీ అని చెబుతాను. మన పార్టీ అంటాను. నందమూరి - నారా కుటుంబాలకు చెందిన పార్టీ అని చెప్పను. ఎందుకంటే తాతగారు తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ. దానిలోకి కుటుంబాల పేర్లను లాగడం కరెక్ట్ కాదు. ఈయన తర్వాత మేము.. లేదా ఇంకొకరు అని మా కుటుంబంలో ఎవరం ఆలోచించలేదు. బయట జనాలు మాట్లాడుకునేవన్నీ ఊహలే తప్ప. నిజం కాదు. మావయ్య చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) గారు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడుతుంటారు. నందమూరి ఫ్యామిలీని పార్టీలోకి రానివ్వకూడదు అని ఆయన ఎప్పుడూ అనుకోరు. అలా అనుకుంటే ప్రచారానికి కూడా రానివ్వరు కదా. అవసరానికి వాడుకుని వదిలేసే టైప్ కాదు మా మావయ్య. మాకు ఏదన్నా సమస్య ఉంటే ఇది తీర్చండి.. ఫలానా పని చేసి పెట్టండి అని మావయ్య దగ్గరకు వెళ్లి అడిగే స్వేచ్ఛ, స్వతంత్రం మాకుంది. మా అత్తయ్య భువనేశ్వరి మా అందరినీ అమ్మలా చూసుకుంటుంది. నందమూరి, నారా కుటుంబాలు వేరు అని మేం ఎప్పుడే అనుకోలేదు. మా మధ్య అడ్డు గోడలు లేవు. మా మావయ్య అమేజింగ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన సీఎంగా ఉన్న కాలంలో అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైటెక్ సిటీతో ప్రారంభమైన అభివృద్ధి హైదాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సెక్టర్‌ను ఎంత వరకూ తీసుకెళ్లిందో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబుగారు ఓడిపోయాం అని నిరుత్సాపడరు. పోరాటం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. మావయ్య, బాబాయ్ సైన్యాధక్షుల్లా పని చేస్తే మేం సైనికుల్లా ఉంటాం’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. రాజకీయ సమావేశాల్లో పాల్గొనప్పుడు నేను ఎవర్నీ విమర్శించను. జనాలకు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చెబితే చాలు.. ఎవర్నీ ఒకమాట అనాల్సిన అవసరం లేదని నేను నమ్ముతా. ఫైనల్‌గా జనాల నమ్మకమే రాజకీయ నాయకుడిని నిలబెడుతుంది. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఎలా పోటీ చేయాలన్న విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. మావయ్య, బాబాయ్(Balakrishna)తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను’’ అని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో చురుకుగా పాల్గొంటు తనదైన శైలి ప్రసంగాలతో ఆకట్టుకునే సినీ నటుడు తారకరత్న ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. జనవరి 26 మొదలైన యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అక్కడ గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయలో తరలించారు. 23 రోజులపాటు చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడిన ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.