Viral Video: అడిగి మరీ బెత్తంతో కొట్టించుకుని.. ఆపై టీచరమ్మ కాళ్లకు నమస్కరించి..!
ABN , First Publish Date - 2023-03-29T19:14:10+05:30 IST
ఎంత పెద్ద అధికారి అయినా, దేశాధ్యక్షడు అయినా తన చిన్న వయసులో టీచర్ చేత బెత్తం దెబ్బలు తినకుండా ఉండరు. చదువుకునే వయసులో టీచర్ కొట్టే దెబ్బలే పిల్లల ఎదుగులకు సోపానాలు.
ఎంత పెద్ద అధికారి అయినా, దేశాధ్యక్షుడు అయినా తమ చిన్న వయసులో టీచర్ చేత బెత్తం దెబ్బలు తినకుండా ఉండరు. చదువుకునే వయసులో టీచర్ (Teacher) కొట్టే దెబ్బలే పిల్లల (Students) ఎదుగులకు సోపానాలు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు తమకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయురాలిని కలిశారు. ఆమెను అడిగి మరీ బెత్తంతో కొట్టించుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను ఎంతో సంతోషంగా నెమరువేసుకున్నారు. (Teacher Student Video)
IAS అధికారి @AwanishSharan ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన దగ్గర్నుంచి ఈ వీడియో చాలా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంతో మంది భావోద్వేగానికి గురవుతున్నారు. తమ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు పూర్వ విద్యార్థులు ఇటీవల కలుసుకున్నారు. తమ చిన్ననాటి ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ వరుసగా ఆమె చేత బెత్తం దెబ్బలు తిన్నారు. తర్వాత ఆమె కాళ్లకు మొక్కారు. అందరూ చాలా సంతోషంగా గడిపారు. (Emotional Video)
Wife Shocking Decision: నా భర్త సంతోషమే నాకు ముఖ్యం.. వేరే స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా బాధలేదంటూ ఓ భార్య వింత నిర్ణయం..!
ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది చూశారు. 26 వేల మందికి పైగా లైక్ చేశారు. మరెంతో మంది ఆ వీడియోను వాట్సాప్‌ల ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. ``టీచర్ చేతిలోని కర్ర ఎంతో మంది జీవితాలను ఉన్నత స్థానాల వైపు తీసుకెళ్తుంద``ని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.