Viral News: గుక్కపట్టి ఏడుస్తున్న ఓ పాప.. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి డౌట్.. స్కూల్‌లోకి వచ్చి చూస్తే షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-09-29T16:17:27+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలిక తీవ్ర భయాందోళనలకు గురైంది. స్కూలు భవనంలో ఒంటరిగా ఉండిపోయి గుక్కపట్టి ఏడ్చింది. అలా రెండు గంటల పాటు తీవ్ర ఒత్తిడికి లోనైంది. రోడ్డు మీద వెళ్తున్న వారికి ఆ ఏడుపు వినిపించడంతో అసలు విషయం బయటపడింది

Viral News: గుక్కపట్టి ఏడుస్తున్న ఓ పాప.. రోడ్డు పక్కన వెళ్తున్న వారికి డౌట్.. స్కూల్‌లోకి వచ్చి చూస్తే షాకింగ్ సీన్..!

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బారాబంకి జిల్లాలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలిక (Girl) తీవ్ర భయాందోళనలకు గురైంది. స్కూలు భవనంలో ఒంటరిగా ఉండిపోయి గుక్కపట్టి ఏడ్చింది. అలా రెండు గంటల పాటు తీవ్ర ఒత్తిడికి లోనైంది. రోడ్డు మీద వెళ్తున్న వారికి ఆ ఏడుపు వినిపించడంతో అసలు విషయం బయటపడింది. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన విద్యా శాఖ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఇద్దరు ఉపాధ్యాయుల జీతాలను ఆపేసింది.

బారాబంకీలోని తాసిపూర్ ప్రైమరీ స్కూల్‌ (Primary School)లో 2వ తరగతి చదువుతున్న ఆయుషి ఈ నెల 26వ తేదీన తరగతి గదిలో నిద్రపోయింది. మధ్యాహ్నం స్కూల్ సమయం అయిపోయిన తర్వా ఉపాధ్యాయులు (Teachers) హడావిడిగా స్కూల్ భవనానికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. నిద్ర నుంచి లేచిన తర్వాత ఆయుషి తాను ఒంటరిగా ఉన్నట్టు తెలుసుకుని షాకైంది. భయంతో గుక్కపట్టి ఏడ్చింది. అలా రెండు గంటల పాటు ఆ భవనంలో ఒంటరిగా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత రోడ్డుపై వెళ్తున్న వారికి స్కూలు భవనం నుంచి ఏడుపు వినిపించి వెళ్లి చూశారు.

Success Story: చేతిలో డబ్బుల్లేక.. జాబ్ కోసం కంపెనీల చుట్టూ తిరిగిన ఈ కుర్రాడికే.. ఇప్పుడు సొంతంగా ఓ కంపెనీ.. నెల నెలా..!

భవనం లోపల ఆయుషి ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో స్కూలు ప్రిన్సిపల్‌కు పలుసార్లు ఫోన్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో తాళాలు బద్దలుగొట్టి పాపను బయటకు తీశారు. ఆ ఘటనపై మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఆ స్కూల్ సిబ్బందిపై విద్యా శాఖ చర్యలు తీసుకుంది. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి, మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయుల జీతాలను ఆపేసింది.

Updated Date - 2023-09-29T16:17:27+05:30 IST