Yellow Teeth: పనికిరావని పారేసే అరటి తొక్కలతోనే.. పచ్చగా ఉండే పళ్లను తళతళా మెరిసేలా చేయొచ్చని తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-08-23T16:25:02+05:30 IST

ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకుంటున్నా కూడా కొందరి పళ్లు పసుపు రంగులోనే ఉంటాయి. దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. దంతాలు పచ్చగా ఉంటే నోరు తెరవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లోనే చాలా సులభంగా పళ్ల రంగును తెల్లగా మార్చుకునే టిప్స్ ఉన్నాయి.

Yellow Teeth: పనికిరావని పారేసే అరటి తొక్కలతోనే.. పచ్చగా ఉండే పళ్లను తళతళా మెరిసేలా చేయొచ్చని తెలిస్తే..!

ప్రతిరోజూ దంతాలను (Teeth) శుభ్రం చేసుకుంటున్నా కూడా కొందరి పళ్లు పసుపు రంగు (Yellow Teeth)లోనే ఉంటాయి. దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. దంతాలు పచ్చగా ఉంటే నోరు తెరవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పళ్ల రంగును తెల్లగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరకు డాక్టర్లను ఆశ్రయిస్తారు. అయితే ఇంట్లోనే చాలా సులభంగా పళ్ల రంగును తెల్లగా మార్చుకునే టిప్స్ ఉన్నాయి. అందుకోసం కేవలం అరటి తొక్కలు (Banaa peel) చాలు.

అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అరటి పండు మాత్రమే కాదు.. దాని తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. అరటి తొక్కను దంతాలను తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఉదయం బ్రష్‌కు ముందు అరటి తొక్కలోని తెల్లని భాగాన్ని దంతాలపై రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఇందులో ఉండే పొటాషియం, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు దంతాలకు మేలు చేస్తాయి. ఆ తరువాత బ్రష్ చేయాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే దంతాల రంగు పసుపు నుంచి తెల్లగా మారుతుంది (Health Tip).

Viral Video: బాబోయ్.. అసలేం జరుగుతోంది..? కారు పైకి అతడు ఎందుకిలా ఎక్కాల్సి వచ్చిందో తెలిస్తే..!

అరటి తొక్కతో మాత్రమే కాదు.. ఆవాలు, ఉప్పుతో కూడా మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. అర టీ స్పూన్ ఆవాల నూనెలో చిటికెడు ఉప్పు కలపి ఆ మిశ్రమాన్ని వేలితో దంతాలు, చిగుళ్ళపై రుద్దాలి. ఇలా సుమారు 4-5 నిమిషాల పాటు ప్రతిరోజూ మీ దంతాలపై రుద్దాలి. కొన్ని రోజుల్లో మీరు తేడాను చూడవచ్చు. సాధారణంగా పళ్లపై ఉండే ఎనామిల్‌ను పాడుచేసే ఆహారాలని తీసుకోవడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారతాయి. అలాగే కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారతాయి.

Updated Date - 2023-08-23T16:25:02+05:30 IST