Costly Revenge: ఉద్యోగంలోంచి తీసేసిన వాళ్లందరికీ నిద్రలేకుండా చేశాడు.. ఏకంగా 15 కార్లను ఏం చేశాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-03-17T15:38:15+05:30 IST
ఆరేడేళ్లుగా పని చేస్తున్న తనను ఒక్కసారిగా ఉద్యోగంలో నుంచి తీసేసిన వారిపై ఓ యువకుడు దారుణంగా పగ తీర్చుకున్నాడు. భారీ ఆస్తి నష్టం కలిగించాడు.
ఆరేడేళ్లుగా పని చేస్తున్న తనను ఒక్కసారిగా ఉద్యోగంలో నుంచి తీసేసిన వారిపై ఓ యువకుడు దారుణంగా పగ తీర్చుకున్నాడు (Terrible revenge). భారీ ఆస్తి నష్టం కలిగించాడు. అతడు చేసిన పని సీసీటీవీ కెమేరాలో రికార్డు కావడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) నోయిడాలో ఓ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన రామ్‌రాజ్ అనే యువకుడు నోయిడాలోని (Noida) మాక్స్‌బ్లిస్ వైట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన వాహనాలను శుభ్రం చేసేవాడు. గత ఆరేడేళ్లుగా రామ్‌రాజ్ అక్కడ పని చేస్తున్నాడు. ఇటీవల, అపార్ట్‌మెంట్ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. రామ్‌రాజ్ సరిగా పనిచేయడం లేదని అపార్ట్‌మెంట్ వాసుల నుంచి ఫిర్యాదు రావడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ఉన్నట్టుండి తనను ఉద్యోగం (Job) నుంచి తొలగించడంపై రామ్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అపార్ట్‌మెంట్ వాసులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.
Viral Post: 5వ తరగతి చదువుతున్న నా కొడుకు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇదీ.. అంటూ ఓ తండ్రి పోస్ట్.. నెటిజన్ల నుంచి అనూహ్య రెస్పాన్స్..!
బుధవారం ఉదయం అపార్ట్‌మెంట్ పార్కింగ్ ఏరియాకు వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న 15 వాహనాలపై యాసిడ్ పోశాడు. అందరూ తమ వాహనాలను చూసుకుని షాకైపోయారు. మొత్తం 15 కార్లూ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా ఆ వాహనాలపై రామ్‌రాజ్ యాసిడ్ (Acid) పోస్తుండడం కనిపించింది. ఆ ఫుటేజ్ ఆధారంగా రామ్‌రాజ్‌పై అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్‌రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.