అంబులెన్స్‌లో పూలతో అలంకరించిన శవపేటిక.. డ్రైవర్ కంగారును చూసి పోలీసులకు డౌట్.. ఓపెన్ చేస్తే కనిపించిన సీన్ చూసి అంతా షాక్..!
ABN , First Publish Date - 2023-03-08T15:16:57+05:30 IST
ఆ రోడ్డుపై పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు.. అటువైపు వేగంగా ఓ అంబులెన్స్ వస్తోంది.. లోపల ఓ శవపేటిక అందంగా పూలతో అలంకరించి ఉంది.. పోలీసులు వెంటనే అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.. అయితే ..
ఆ రోడ్డుపై పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు.. అటువైపు వేగంగా ఓ అంబులెన్స్ (Ambulance) వస్తోంది.. లోపల ఓ శవపేటిక (Coffin) అందంగా పూలతో అలంకరించి ఉంది.. పోలీసులు వెంటనే అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.. అయితే అంబులెన్స్ డ్రైవర్ కంగారు చూసి పోలీసులకు డౌట్ వచ్చింది.. అంబులెన్స్‌ను ఆపి శవపేటిక తెరిచి చూసి షాకయ్యారు.. ఎందుకంటే లోపల శవం లేదు.. భారీ సంఖ్యలో మద్యం సీసాలు (Liquor Bottles)కనిపించాయి.. బీహార్‌లోని (Bihar) నలందలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్‌లో ఎప్పట్నుంచో మద్య నిషేధం (Prohibition) అమల్లో ఉంది. అయితే ``పుష్ప`` సినిమా తరహాలో స్మగ్లర్లు రకరకాల ప్లాన్లు వేసి మద్యం స్మగ్లింగ్ (Liquor Smuggling) చేస్తుంటారు. కొన్నిసార్లు పోలీసులకు దొరికిపోతుంటారు. తాజాగా నలందుకు సమీపంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. నలందకు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ అంబులెన్స్ వచ్చింది. జార్ఖండ్ నుంచి ముజఫర్‌పూర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. అంబులెన్స్‌లో శవపేటిక చూసి లోపల మృతదేహం ఉంటుందని పోలీసులు కూడా భావించారు. అయితే డ్రైవర్, అతడి అసిస్టెంట్ తీరు పోలీసులకు అనుమానం కలిగించింది.
18 ఏళ్ల క్రితమే భర్త మృతి.. కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయినా రోజూ పొలం పనులకు వెళ్తూనే ఉన్న తల్లి.. అదేమని అడిగితే..
పోలీసులకు అనుమానం వచ్చి శవపేటికను తెరిచి చూడడంతో రహస్యం బయటపడింది. శవపేటికను తెరిచి చూడగా అందులో మృతదేహానికి బదులు ఐదు బస్తాలు కనిపించాయి. ఆ బ్యాగులను తెరిచి చూడగా అందులో మద్యం సీసాలు కనిపించాయి. అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌తో సహా ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌లో మొత్తం 186 ఖరీదైన బ్రాండ్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.