5 రోజులు, నాలుగున్నర రోజులు, 4 రోజులు, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్.... మారుతున్న వర్క్ కల్చర్ తీరుతెన్నులివే..!
ABN , First Publish Date - 2023-05-01T12:04:41+05:30 IST
భారతదేశంలోని సాధారణ ఉద్యోగులకు ప్రస్తుతం వారానికి ఆరు రోజుల పని విధానం(Six day work schedule) అమలులో ఉంది. అయితే కొన్ని సంస్థల్లో మాత్రం ఐదు రోజుల పని దినాలు ఉన్నాయి.
భారతదేశంలోని సాధారణ ఉద్యోగులకు ప్రస్తుతం వారానికి ఆరు రోజుల పని విధానం(Six day work schedule) అమలులో ఉంది. అయితే కొన్ని సంస్థల్లో మాత్రం ఐదు రోజుల పని దినాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో ఐదు రోజులు మాత్రమే ఉద్యోగులు వర్క్ చేస్తారు.
శని, ఆది వారాలు వారికి సెలవు. ఇదిలావుండగా ఉద్యోగుల పనిదినాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) ఆమధ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలుగా ఉంటాయని ప్రకటించింది. ఇప్పటి వరకూ యూఏఈ(UAE)లో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి. శని, ఆదివారాలు సెలవు. అయితే ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు నిర్వహించాల్సివుంటుంది.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారికి వారాంతపు సెలవులు మొదలవుతాయి. మరోవైపు యునైటెడ్ కింగ్ డమ్(United Kingdom)లోని వంద కంపెనీలు ఇటీవల వారానికి నాలుగు రోజులు పనిచేస్తే చాలని తమ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చాయి. అదికూడా జీతంలో ఎలాంటి కోత విధించబోమని ప్రకటించాయి. ఈ కొత్త విధానాన్ని(new approach) కంపెలనీలో శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించాయి. దీని వలన ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో ఎటువంటి మార్పులేదని వెల్లడించాయి.
ఇదిలా ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చిన్న కంపెనీలు, స్టార్టప్(Startup)లు విరివిగా వాడుకుంటున్నాయి. ఈ విధానంలో ఉద్యోగి ఇంటి నుంచే కార్యాలయ పని చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివలన ఉద్యోగి ఒత్తిడి(stress)కి గురికాడని నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ కల్చర్(Hybrid work culture) విధానం కూడా అందుబాటులోకి వచ్చింది.
అంటే వారంలో సగం రోజులు ఇంటి నుంచి మిగతా సగం రోజులు ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రముఖ ఈకామర్స్ సంస్థ మీషో తమ ఉద్యోగులకు(employees) ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది. వారంలో కేవలం ఒక రోజు ఆఫీసుకు వస్తే చాలని తెలిపింది. వారంలో మిగతా రోజులన్నీ ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది.