పాకిస్తాన్‌లో ఏస్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-12T13:59:02+05:30 IST

ఇప్పుడు ప్రపంచమంతా ఫోను గుప్పిట్లో చిక్కుకుంది. ఎక్కడ ఏమి జరిగినా ఫోను మాధ్యమంలో త్వరగా అందరికీ చేరువవుతోంది.

పాకిస్తాన్‌లో ఏస్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయో తెలుసా?

ఇప్పుడు ప్రపంచమంతా ఫోను గుప్పిట్లో చిక్కుకుంది. ఎక్కడ ఏమి జరిగినా ఫోను మాధ్యమంలో త్వరగా అందరికీ చేరువవుతోంది. ఈ నేపధ్యంలోనే ఫోన్ల వినియోగం(Use of phones) మరింతగా పెరిగింది. అయితే మన పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌(Samsung smartphone)లు పాకిస్తాన్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

దాని తరువాత చూసుకుంటే Huawei, Q మొబైల్, Oppo, Motorola స్మార్ట్‌ఫోన్‌లకు పాక్‌లో ప్రత్యేక ఆదరణ దక్కుతోంది. కౌంటర్‌పాయింట్ ట్రాకర్ తెలిపిన వివరాల ప్రకారం శామ్సంగ్ కంపెనీ 22 శాతం మార్కెట్ వాటాతో పాకిస్తాన్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. ఆ తరువాత Huawei (19 శాతం), Oppo (17 శాతం), Q మొబైల్ (15 శాతం) మార్కెట్‌తో తమ వాటాను నిలబెట్టుకున్నాయి. ఇవే కాకుండా Motorola, Nokia, Apple, LG స్మార్ట్‌ఫోన్‌లు కూడా పాకిస్తాన్‌(Pakistan)లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనా.. పాకిస్తాన్ మార్కెట్‌లో చౌక స్మార్ట్‌ఫోన్‌లను డంప్ చేస్తోంది. పాకిస్తాన్ ఫోన్ మార్కెట్‌లో 62 శాతాన్ని చైనా కంపెనీలు ఆక్రమించాయి. కాగా చైనా కంపెనీలు భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

పాకిస్తాన్‌లో విక్రయమయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో రూ. 7,000 ధర కన్నా తక్కువ ధర కలిగినవే అత్యధికంగా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని మొబైల్ సబ్‌స్క్రైబర్‌(Mobile Subscriber)లలో కేవలం 30 శాతం మంది మాత్రమే 3G/4G కనెక్షన్‌లను కలిగి ఉన్నారు. 80 శాతం కంటే ఎక్కువ టెలిడెన్సిటీ ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమ(Telecommunications industry) వృద్ధి నిలిచిపోయింది, వాయిస్ ఆధారిత విభాగంలో ప్రస్తుతం జోంగ్ 4G నెట్‌వర్క్ పరంగా పాకిస్తాన్‌లో అతిపెద్ద నెట్‌వర్క్ కలిగివుంది. ఇది చైనాకు చెందిన సంస్థ.

Updated Date - 2023-04-12T13:59:02+05:30 IST