chanakya niti: మనిషిని లక్ష్యానికి దూరం చేసే తప్పులివే...

ABN , First Publish Date - 2023-04-10T06:56:30+05:30 IST

ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని(target) సాధించడానికి తన వంతుగా కష్టపడతాడు. విజయ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు(difficulties) వచ్చినా వాటితో పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

chanakya niti: మనిషిని లక్ష్యానికి దూరం చేసే తప్పులివే...

ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని(target) సాధించడానికి తన వంతుగా కష్టపడతాడు. విజయ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు(difficulties) వచ్చినా వాటితో పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చాణక్యుడు(Chanakya) తెలిపిన వివరాల ప్రకారం మనిషి చేసే కొన్ని తప్పులు లక్ష్యాన్ని చేరుకోనివ్వవు. అప్పుడు ఎంత ప్రయత్నించినా విజయం(success) సాధించలేరు. చాణక్యుడు చెప్పిన విజయానికి అవసరమయ్యే నాలుగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వైఫల్య భయం(Fear of failure)తో మీరు మీ లక్ష్యం దిశగా సాగకపోతే, అది అతిపెద్ద తప్పు అవుతుంది. మనసులో అపజయ(failure) భయం ఉన్నవాడు ఏది సాధించాలని ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేడు. కష్టపడకుండా ఎవరూ లక్ష్యాన్ని(target) సాధించలేరు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఇతరులను చూసి ఏదైనా పనిని లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకోకూడదు. మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ప్రశ్నలను(Questions) మిమ్మల్ని మీరు అడగండి. ఈ పని చేయగలనా? వచ్చే ఫలితం ఏమిటి? విజయం సాధించడం ద్వారా వచ్చేదేమిటి? ఈ ప్రశ్నలతో మీకు మీరు సంతృప్తి(Satisfied) చెందితేనే కొత్త పనిని ప్రారంభించండి. విజయం విషయంలో చాణక్యుడు చెప్పినది ఏమంటే.. ఏదైనా పనికి సరైన వ్యూహం(strategy) లేనందున అది విఫలమవుతుంది. అలాగే ఏదైనా పని చేసేముందు ఇతరులకు చెప్పడం వలనకూడా వైఫల్యం(failure) ఎదురవుతుందని చాణక్య తెలిపారు.

Updated Date - 2023-04-10T06:56:30+05:30 IST