Viral Video: ఈ కుర్రాళ్ల క్రియేటివిటీకి అవాక్కైన Harsh Goenka.. పనికి రాని వస్తువుల నుంచే ఏడుగురు కూర్చునే ఈ బైక్..!

ABN , First Publish Date - 2023-05-01T15:11:41+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్ష్ గోయెంకా (Harsh Goenka), ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తరచుగా సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి. తమకు ఫన్నీగా అనిపించినవాటిని, అద్భుతం అనిపించినవాటిని తమ ఫాలోవర్లతో పంచుకుంటారు.

Viral Video: ఈ కుర్రాళ్ల క్రియేటివిటీకి అవాక్కైన Harsh Goenka.. పనికి రాని వస్తువుల నుంచే ఏడుగురు కూర్చునే ఈ బైక్..!

ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్ష్ గోయెంకా (Harsh Goenka), ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తరచుగా సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి. తమకు ఫన్నీగా అనిపించినవాటిని, అద్భుతం అనిపించినవాటిని తమ ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ వీడియో కూడా అలాగే వైరల్ (Viral Video) అవుతోంది. కుర్రాళ్ల క్రియేటివిటీ హర్ష్ గోయెంకాను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో ఓ సెవెన్ సీటర్ బైక్‌పై (7 seater bike) కుర్రాళ్లు వెళుతున్నారు. ఆ బైక్ నడిచేది పెట్రోల్‌తోనో, కరెంట్‌తోనో కాదు.. సోలార్ ఎనర్జీతో (Solar Energy). అవును సూర్యకాంతిని (Sunlight) ఇంధనంగా తీసుకుని ఆ వాహనం ముందుకెళ్తుంది. ఆ వాహనాన్ని పూర్తిగా స్క్రాప్‌తో (Scrap) తయారు చేశారు. ఆ బైక్‌ పైన సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. భారతీయులు తయారు చేసే ఇలాంటి సృజనాత్మక వస్తువులు చూస్తే తనకెంతో గర్వకారణంగా ఉంటుందన్నారు. హర్ష్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Selfie New Rule: ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఏకంగా రూ.24 వేలు జరిమానా.. ఈ 5 ప్రాంతాల్లో సెల్ఫీలపై నిషేధం..!

దీని నిర్మాణానికి 8 నుంచి 10 వేల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. బైక్‌పై అమర్చిన సోలార్ ప్యానెల్ ఎండ, వాన నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇది సౌరశక్తితో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఇలాంటి వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావాలని చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు.

Updated Date - 2023-05-01T15:11:41+05:30 IST