Viral Video: టీవీ సీరియల్ షూటింగ్‌లో షాకింగ్ సీన్.. రాత్రి పూట 200 మందితో షూటింగ్ చేస్తోంటే సడన్‌గా చిరుత పులి ఎంట్రీ..!

ABN , First Publish Date - 2023-07-28T14:12:38+05:30 IST

చిరుతల దాడి గురించి ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని,. ఆ దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు అక్కడి ప్రజలు.

Viral Video: టీవీ సీరియల్ షూటింగ్‌లో షాకింగ్ సీన్.. రాత్రి పూట 200 మందితో షూటింగ్ చేస్తోంటే సడన్‌గా చిరుత పులి ఎంట్రీ..!
Viral Video

కూడు, గూడు అన్నారు. ఇవి ఉంటే ఎక్కడన్నా హాయిగా జీవించేయచ్చు. మనుషులైనా, పశుపక్షాదులైనా గూడు చెదిరిపోతే అవి జనావాసాలమీదకు వచ్చిపడతాయి. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలు చాలానే చూసాం. అయితే చిరుతలు, ఎలుగుబంట్లు, కోతులు ఇలాంటి జీవులు జనావాసాల్లోకి వచ్చి పడడానికి ముఖ్య కారణం వాటి నివాసమైన అడవులను నరికేయడమే.. అంతరించిపోతున్న అడవుల వల్ల కడుపు కాలి జనాల మీదకు వచ్చేస్తున్నాయి ఈ జంతువులు. రావడమే కాదు ఆకలి తీర్చుకునేందుకు మనుషులమీద, మూగా జీవాల మీద దాడికి తెగబడుతున్నాయి.

ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం. అయితే తాజాగా ఓ షూటింగ్ సెట్ కి పులి వచ్చింది. ముంబైలోని గోరేగావ్‌లోని ఓ టెలివిజన్ సీరియల్ సెట్‌లోకి చిరుతపులి ప్రవేశించింది, దీంతో సెట్‌లో ఉన్న 200 మందిని భయాందోళనకు గురిచేసింది. ఫిల్మ్ సిటీలోని మరాఠీ టీవీ సీరియల్ 'సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా' సెట్‌లో చిరుతపులి తన పిల్లతో పాటు సిబ్బందికి కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సెట్లో ఆ సమయానికి 200 మందికి పైగా ఉన్నారు, ఎవరైనా ప్రాణాలు కోల్పోవచ్చనేంత హడలిపోయారు. ఫిలిం సిటీలో నిత్యం చిరుతలు కనిపిస్తున్నా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అక్కడివారన్నారు. గత 10 రోజులలో ఇది మూడవ సందర్భం. చిరుతల దాడి గురించి ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని,. ఆ దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు ఆవేదన వ్యక్తం చేసారు అక్కడి ప్రజలు.


ఇది కూడా చదవండి: డ్రైవరన్నా.. నీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్.. ఓ ప్రయాణీకుడిలాగే బస్సు ఎక్కిన దొంగోడికి చుక్కలు చూపించాడు..!

ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతపులి సెట్‌లోకి ప్రవేశించి, ఆపై లైట్లు ఆపి వేసిన తరువాత ఆ చోట పులి పై మిద్దిమీద నుంచే వెళుతున్న వీడియో కనిపిస్తుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-28T14:12:38+05:30 IST