Viral News: దీన్ని తినాలంటే కోటీశ్వరులకే సాధ్యం.. ఒక్క కేజీ ధర ఏకంగా రూ.13.50 లక్షలట.. ఇంతకీ ఇదేంటంటే..!
ABN , First Publish Date - 2023-09-08T19:56:14+05:30 IST
చీజ్‌ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం చీజ్‌ను వివిధ రకాల వంటల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పాస్తాల్లో, బర్గర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే చీజ్ ధర ఎంతుంటుంది? మహా అయితే అయితే రూ.వంద లేదంటే రూ.రెండొందలు ఉంటుంది.
చీజ్ (Cheese)ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం చీజ్‌ను వివిధ రకాల వంటల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పాస్తాల్లో, బర్గర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే చీజ్ ధర ఎంతుంటుంది? మహా అయితే అయితే రూ.వంద లేదంటే రూ.రెండొందలు ఉంటుంది. కానీ, స్పెయిన్ (Spain)లోని ఓ రెస్టారెంట్ తయారు చేసే చీజ్ ఖరీదు ఎంతో తెలిస్తే నొరెళ్లబెట్టాల్సిందే. ఆ చీజ్ ధరతో ఏకంగా ఓ కారే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ చీజ్ (Most expensive Cheese) ధర ఏకంగా 13.50 లక్షల రూపాయలు మరి.
స్పెయిన్‌లోని లాగర్ డి కొలోటో అనే రెస్టారెంట్ ఈ ప్రత్యేకమైన చీజ్‌ను రూపొందించింది. ఈ చీజ్ పేరు ``కాబ్రెల్స్ బ్లూ చీజ్`` (Cabrales Cheese). ఈ చీజ్ తయారు చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక పరిస్థితుల్లో ఈ చీజ్‌ను తయారు చేస్తారు. ఈ చీజ్ తయారీకి దాదాపు 8 నెలల సమయం పడుతుందట. ఇటీవల తయారు చేసిన రెండు కేజీల ``కాబ్రెల్స్ బ్లూ చీజ్``ను ఏకంగా 30 వేల యూరోలకు అమ్మారు. అంటే భారతీయ కరెన్సీలో రూ.27 లక్షలు. అంటే ఒక కేజీ ధర రూ.13.50 లక్షలు (Viral News).
Dog Drinks Beer: పెంపుడు కుక్కకు బలవంతంగా బీర్ తాగించిన యువతి.. చివరకు ఇప్పుడామె పరిస్థితి ఏంటంటే..!
ఆవు, గొర్రెలు, మేక పాలను కలిపి లాస్ పికోస్ డి యూరోపా పర్వతం గుహలో నిల్వ చేస్తారు. దీని తయారీలో ఎలాంటి మెషిన్లను ఉపయోగించరు. పూర్తిగా చేతులతోనే తయారు చేస్తారు. గుహలో తేమ కారణంగా ఆ చీజ్‌పై నీలిరంగు మచ్చలు, చారలు ఏర్పడతాయి. ఆ తర్వాత దానిని తీసుకెళ్లి 8 నెలల పాటు ప్రాసెస్ చేస్తారు. 2019లో ఈ చీజ్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. తాజాగా ఆ రికార్డును మళ్లీ అదే ``కాబ్రెల్స్ బ్లూ చీజ్`` బ్రేక్ చేయడం విశేషం.